Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రం తర్వాత అనుష్క భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. దాదాపు సంవత్సర కాలంగా భాగమతి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి వార్తలు, ప్రకటనలు రావడం లేదు. సినిమాకు సంబంధించి మీడియాలో వారంకు లేదా రెండు వారాలకు ఒక్కటి చొప్పున ఏదో ఒక వార్త వస్తునే ఉంది. మొన్నటి వరకు భాగమతి విడుదల కాబోతుందని అన్నారు, ఆ తర్వాత అనుష్క లావు ఎక్కువ ఉండటం వల్ల అయిదు కోట్లు అధనంగా ఖర్చు చేస్తూ ఆమె సైజ్‌ను చిన్నగా కనిపించేలా గ్రాఫిక్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా అనుష్క ‘భాగమతి’ చిత్రంలో రెండు పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మీడియాలో వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ‘భాగమతి’ దర్శకుడు అశోక్ కాని, హీరోయిన్ అనుష్క కాని, నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్లలో ఏ ఒక్కరు ఇప్పటి వరకు స్పందించినది లేదు. వీరు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు అనే విషయంపై చర్చ జరుగుతుంది. సినిమాలో నటించేది ఎవరు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. తాజాగా సినిమాను నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఆ వార్త కూడా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా వచ్చింది కాదు.
ఇప్పటి వరకు ‘భాగమతి’ గురించి లెక్కకు మించిన వార్తలు, పుకార్లు వచ్చాయి. కాని ఇప్పటి వరకు వాటిపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించేందుకు ముందుకు రావడం లేదు. అసలు సినిమా ఉందా లేదా, ప్రకటించి వదిలేశారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్య ఏ సినిమా చేస్తున్నా కూడా ప్రతి రోజు అప్డేట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కాని భాగమతి సినిమాను మాత్రం విడుదల ముందు వరకు కూడా ఎలాంటి హంగామా లేకుండా చూస్తున్నారు. సైలెంట్‌గా సినిమాను విడుదల చేసి పెద్ద విజయాన్ని దక్కించుకోవాలని యూవీ క్రియేషన్స్ నిర్మాతలు భావిస్తున్నారేమో..!