జక్కన్న ఫ్లాప్‌ సెంటిమెంట్‌ను నిరూపించిన అనుష్క

anushka shetty breaks rajamouli sentiment

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ జక్కన్న ఏ చిత్రాన్ని చేసినా సూపర్‌ హిట్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి మొదటి సినిమా నుండి చివరగా విడుదలైన ‘బాహుబలి 2’ వరకు అన్ని కూడా సూపర్‌ సక్సెస్‌ సాధించినవే. దాదాపు అన్ని సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్స్‌ను అందుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి రెండు పార్ట్‌లు కూడా బాలీవుడ్‌ రికార్డులను కూడా కొల్లగొట్టాయి. తన ప్రతి సినిమాతో సక్సెస్‌ను దక్కించుకున్న జక్కన్న తన సినిమాలో హీరోలకు మాత్రం చేదు అనుభవంను మిగుల్చుతూ ఉంటాడు. జక్కన్నతో సినిమా చేసిన ప్రతి ఒక్క హీరో ఆ తర్వాత చేసిన ఇతర చిత్రాలు దారుణంగా ఫ్లాప్‌ అయ్యాయి. ప్రభాస్‌, నితిన్‌, చరణ్‌, సునీల్‌ ఇలా అందరి విషయంలో కూడా రాజమౌళి ఫ్లాప్‌ సెంటిమెంట్‌ నిరూపితం అయ్యింది.

తాజాగా మరోసారి జక్కన్న ఫ్లాప్‌ సెంటిమెంట్‌కు అనుష్క బలి పశువు అయ్యింది. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల తర్వాత ‘సైజ్‌ జీరో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ‘బాహుబలి 2’ తర్వాత ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క మరోసారి ఫ్లాప్‌ను చవి చూసింది. ఇప్పటి వరకు హీరోలకు మాత్రమే జక్కన్న ఫ్లాప్‌ సెంటిమెంట్‌ పట్టి పీడిస్తుందని అంతా భావించారు. కాని తాజా పరిస్థితులు చూస్తుంటే హీరోయిన్స్‌కు కూడా ఆ ఎఫెక్ట్‌ కొడుతుందని నిరూపితం అయ్యింది. గతంలో కూడా చూసుకుంటే జక్కన్న దర్శకత్వంలో నటించిన పలువురు హీరోయిన్స్‌ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఇప్పుడు అదే దారిలో అనుష్క కూడా వరుసగా ఫ్లాప్‌ అవుతూ ఉంది. అనుష్క మళ్లీ ఫాంలోకి వచ్చేనా లేక కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పడేనా అనేది చూడాలి.