ఎరక్కపోయి ఇరుక్కుపోయి…ఎన్నికల అధికారి కష్టాలు…!

Ap Battalions For Telangana Elections

తెలంగాణ ఎన్నికలకు.. ఏపీ బలగాలు తీసుకోబోమని కొద్ది రోజుల కిందట తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ సైనీ ప్రకటన చేశారు. దానికి కారణంగా ఆయన టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులను సాకుగా చూపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు డబ్బులు పంచుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని అందుకే ఏపీ బలగాలను తాము కోరబోమని చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తెప్పించుకుటామని ప్రకటించారు. టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఏపీ డీజీపీకి నోటీసులు కూడా పంపారు.

ap-commission

అయితే ఇప్పుడు రజత్ కుమార్ సైని నిర్ణయం తేడా కొట్టింది. తెలంగాణలో డిసెంబరు 7న జరిగే ఎన్నికలకు ఏపీ నుంచి పోలీసు బలగాలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీఈసీ ఏపీని కోరాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖకు లేఖ రాశారు. తెలంగాణ ఎన్నికలకు ఏపీ పోలీసులు వద్దంటూ ఇప్పటికే రాష్ట్ర ఈసీ రజత్ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేనందున తెలంగాణ ఈసీ రాసిన లేఖ ఆధారంగా కేంద్ర హోంశాఖ, ఈసీకి అదే విషయాన్ని ఏపీ పోలీసు శాఖ స్పష్టం చేయబోతున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు ఏపీ బలగాలపై రజత్ కుమార్ సైనీ చేసిన వ్యాఖ్యలు మరో సారి తెరపైకి వచ్చాయి. నిజానికి ఏపీ పోలీసులపై టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులో విషయం లేదు. ఎందుకంటే ధర్మపురిలో వాళ్లు

ranjith-singh

డబ్బులు పంచుతున్నారని ఎలాంటి ఆధారాలు లేకుండానే టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అసలు ధర్మపురిలో ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులకు డబ్బులు పంచాల్సిన అవసరం ఏమిటనే అంశాన్ని కూడా.. ఎన్నికల అధికారి పట్టించుకోకుడా.. వాళ్లిచ్చిన వీడియోలను కూడా చూడకుండా నేరుగా ఏపీ డీజీపీకి నోటీసులు పంపారు. ఏపీ డీజీపీ ఆ నోటీసుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంటలిజెన్స్ పోలీసులు అన్న తర్వాత సమాచారం కోసం ఎక్కడికైనా వెళ్తారని ధర్మపురి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. అంతేకాక ఈసీ పంపిన వీడియోలో డబ్బులు ఎక్కడున్నాయని రివర్స్‌లో ప్రశ్నించడంతో సైనీకి షాక్ తగిలినట్లయింది. దీంతో ఏపీ పోలీసులు కోడ్ ఉల్లంఘించలేదని మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏపీ బలగాల కోసం విజ్ఞప్తి చేసుకున్నారు. నిజానికి ఎక్కడెక్కడి నుంచి బలగాలు తెప్పించాలన్న విషయం తెలంగాణ ఎన్నికల అధికారి చేతుల్లో ఉండదు. తమకు ఎంత అవసరమో చెబితే ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి సర్దుబాటు చేస్తుంది. ఈ విషయం రజత్ కుమార్‌కు తెలియక కాదు. అయినా సరే ఆయన ఏపీ బలగాలు వద్దంటూ ప్రకటన చేశారు. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. భస్మాసుర హస్తం లాగా అయన విలువని ఆయనే పోగొట్టుకునే ప్రకటన చేసి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునే పనిలో పడ్డారు.

ap-polices