బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కుట్ర పన్నారని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే గుంటూరులోని కన్నా నివాసాన్ని ముట్టడించేందుకు ఈరోజు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. నిజానికి నిన్న కాకినాడ పర్యటనకు వెళ్ళిన బాబుని అక్కడి బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వైఖరికి నిరసనగా టీడీపీ శ్రేణులు నిరసన చేస్తున్నాయి. కన్నా ఇంటిని ముట్టడించిన నేపధ్యంలో టీడీపీ శ్రేణులతో కన్నా కుమారుడు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో, టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన అనంతరం కన్నా మాట్లాడుతూ, నిన్న కాకినాడ పర్యటనలో చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు తమ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారని వారి విన్నపాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నడిరోడ్డు మీదే ఓ మహిళను ఫినిష్ చేస్తానంటూ సీఎం వార్నింగ్ ఇచ్చారని అన్నారు. బాబు, లోకేష్ ల ఆదేశాల మేరకే తనను చంపేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని చెప్పారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ లపై హత్యాయత్నం జరిగిందని… ఇప్పుడు తనపై జరిగిందని ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ ఘటనలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించాలని రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. కన్నా మీద