Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 2019 ఎన్నికలకు దీన్ని సెమి ఫైనల్ గా భావిస్తున్నాయి. ఒక్క గెలుపు విషయంలోనే కాదు. ఎన్నికల వ్యూహాల అంశంలోనూ రెండు పార్టీలు నంద్యాల ఉపఎన్నికని సెమి ఫైనల్ గానే తీసుకుని పని చేస్తున్నాయి. అందుకే మైనార్టీలు ఎక్కువగా ఉన్న నంద్యాలలో మిత్రపక్షం బీజేపీ మాట కానీ ప్రధాని మోడీ ప్రస్తావన గానీ రాకుండా టీడీపీ జాగ్రత్త పడుతోంది. ఇది ఎన్నికల వ్యూహంలో భాగమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులోనే పెద్ద ట్విస్ట్ వచ్చింది.
నిన్నమొన్నటిదాకా టీడీపీ తో పొత్తు వల్లే ఏపీ లో బీజేపీ ఎదగలేకపోతోందని ఆ పార్టీలోని ఓ వర్గం హైకమాండ్ కి మొత్తుకుంటోంది. ఇప్పుడు అదే వర్గం హఠాత్తుగా టోన్ మార్చేసి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం కోసం తమని సరిగ్గా వినియోగించుకోవడం లేదని బాధపడుతోంది. దీనిపై కర్నూల్ బీజేపీ నేతలు బహిరంగ ప్రకటన చేసే స్థాయికి వచ్చింది పరిస్థితి. కానీ నిజానికి ఇది టీడీపీ మీద ప్రేమ కాదు. నంద్యాల లో కాషాయ జెండా రెపరెపలాడించి మైనారిటీ ఓట్లు టీడీపీ కి రాకుండా చేసి ఆ ఓటమిని సాకుగా చూపి వైసీపీ తో పొత్తుకు హైకమాండ్ ని ఒప్పించాలని ఆ వర్గం ఆలోచిస్తోంది. ఇది నాటి మహాభారతంలో శల్యుడు కర్ణుడికి సారధిగా పనిచేసి పాండవ విజయం కోసం పని చేసినట్టే వుంది.
నంద్యాలలో బీజేపీ శల్యసారధ్యం గురించి గ్రహించిన టీడీపీ అధిష్టానం ఉపఎన్నికల్లో కమలనాధుల ప్రభావం లేకుండా చూసేందుకు గట్టి చర్యలే చేపట్టింది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ తగదని ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న నాయకులకి స్పష్టం చేసింది. దాని వల్ల ఇబ్బందులు వస్తే, అవసరం అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ కి కటీఫ్ చెప్పడానికైనా సిద్ధమే అన్నట్టుంది తెలుగు తమ్ముళ్ల వైఖరి.
మరిన్ని వార్తలు: