Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని పీఠంపై మోడీ, బీజేపీ అధ్యక్ష పదవిలో అమిత్ షా… ఈ కాంబినేషన్ చూసి ఆంధ్రప్రదేశ్ లో కమలనాధులు రొమ్ము విరుచుకు నడిచారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబుని లెక్కే లేదన్నట్టు మాట్లాడారు. టీడీపీ సర్కార్ ని ఇబ్బంది పెట్టడానికి ఢిల్లీ వెళ్లి బాబు మీద లేనిపోని చాడీలు చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెంచారు. వారికి పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కూడా అనుకోకుండా ఓ లడ్డులా కనిపంచింది. కానీ అక్కడే వారి అంచనాలు తప్పాయి. ఏ పోలవరం అస్త్రం వారు ప్రయోగించారో అదే వారిపాలిట గుదిబండ అయ్యింది.
చంద్రబాబుని ఇరికిద్దామని పోలవరానికి బ్రేక్ పడేట్టు చేయగానే ప్రజల్లో వ్యక్తం అయిన ఆగ్రహావేశాలు చూసే సరికి ఈ చాడీ నేతలకు షాక్ తగిలింది. అటు కేంద్రంలోని పెద్దలు కూడా తమను తప్పుదారి పట్టించారని విసుక్కోవడంతో చంద్రబాబు మీదకు ఒంటి కాలితో లేవడానికి సిద్ధంగా వుండే బ్యాచ్ సైలెంట్ అయిపోయింది. ఇక ఎక్కడ పోలవరం టాపిక్ వచ్చినా దానిపై మాట్లాడేందుకు వీళ్లంతా భయపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ని టార్గెట్ చేస్తే అది పోలవరం ఖాతాలోకి వెళ్లి జనం ఎక్కడ రివర్స్ అవుతారో అని ఈ నాయకుల భయం. వారి భయం చూస్తే చెప్పలేమా పోలవరం విషయంలో తప్పు ఎవరిదో అని.