ఏపీ ప్రభుత్వం శుభవార్త…నిరుద్యోగ భ్రుతి…ఎంతంటే ?

Ap cabinet signed on unemployment stipend

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ప్రతి నెల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడేలా పధకం రూపొందించాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతి రూ.1000 ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఇందుకోసం రూ.640 కోట్లు ఖర్చవుతాయని తేలింది. 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆగస్ట్ మూడు లేదా నాలుగో వారంలో నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని నిర్ణయించారు.

మంత్రి వర్గం తీసుకున్న మరి కొన్ని నిర్ణయాలు

1. స్టేట్ మెగా సీడ్ పార్క్ పాలసీ-2018 :

i) రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా చేయలన్న సంకల్పంతో రాష్ట్ర మంత్రి మండలి ‘స్టేట్ మెగా సీడ్ పార్క్ పాలసీ-2018’ ఆమోదం తెలిపింది.
ii) విత్తన పరిశ్రమలు పెద్దఎత్తున రాష్ట్రంలో నెలకొల్పేలా, మేలురకం విత్తనాలకు గమ్యస్థానంగా చేసేందుకు వీలుగా ఈ పాలసీని రూపొందించారు.
iii) చీడపీడలను ఎదుర్కొని, అధిక దిగుబడులు ఇచ్చేలా మేలురకం హైబ్రీడ్ విత్తనాల తయారీకి ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా ఎదిగేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుంది.
iv) ప్రభుత్వరంగంలో సీడ్ ఏజెన్సీలు, కార్పొరేషన్లు, ప్రైవేట్ సీడ్ కంపెనీలు, CERT, FPOలు, FPO ఫెడరేషన్లు, NGOలు, APMSP లిమిటెడ్‌కు ఇందులో భాగస్వామ్యం వుంటుంది.
v) 2023 నాటికి దీనిద్వారా రూ. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, 40 వేల మందికి ఉద్యోగాలు ఈ పాలసీ ద్వారా సాధ్యమవుతుందని అంచనా.
vi) నకిలీ విత్తనాలు కొని మోసపోతున్న సన్నచిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని ‘మెగా సీడ్ పార్క్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలను అందిస్తుంది.
vii) విత్తన భద్రత మూలంగా ఆహార భద్రత కూడా వుంటుంది.
viii) విత్తనాలు ఉత్పత్తికి ముందుకొచ్చే రైతులను సీడ్ ప్రెన్యూర్లుగా గుర్తించి ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ యూనిట్లు నెలకొల్పే రైతులకు భూకేటాయింపులతో పాటు పరిశ్రమలకు ఇచ్చే ఇతర అన్ని రాయితీలు అందిస్తుంది.
ix) ఐయోవా స్టేట్ యూనివర్సిటీకి చెందిన సీడ్ సైన్స్ సెంటర్‌తో కలిసి రాష్ట్రప్రభుత్వం కర్నూలు తంగడెంచలో ఏర్పాటు చేస్తున్న మెగా సీడ్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది.

2. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ- మార్కెట్ స్థిరీకరణ నిధి, నిధి నిర్వహణకు ప్రత్యేక ఖాతా:

i) కేంద్ర ప్రభుత్వం సేకరణ చేపట్టినప్పటికీ ప్రాథమికంగా కొన్ని చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొంత నిధి ఉండాలని ప్రభుత్వం భావించింది. NAFAD, FCI రీయింబర్స్ మెంట్ కింద నిధులు కేటాయిస్తుంది. అయితే రాష్ట్రంలో ఈ సేకరణ చేసే ఏజెన్సీలకు ఎటువంటి ముందస్తు నిధులు కేంద్రం ఇవ్వదు.
ii) మొత్తం పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రం చేయదు. కొంత భాగం మాత్రమే సేకరిస్తుంది. మిగిలిన ఉత్పత్తులను కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా సేకరించాల్సి ఉంటుంది. అందువల్ల ఆర్థిక లావాదేవీలకు కొంత నిధి అవసరం ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు సంబంధించి మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
iii) కేంద్ర ప్రభుత్వం మిరప, పసుపు సేకరణకు కనీస మద్దతు ధర ప్రకటించదు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ సేకరణ చేయాలంటే కొంత నిధి అవసరం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి కేబినెట్ లో చర్చించాం.
iv) ఏపీ మార్క్ ఫెడ్ పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ- మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు అవుతుంది.(రూ.500 కోట్ల తో ఈ నిధి ఏర్పాటకు మార్క్ ఫెడ్ ఎండీ ప్రతిపాదన)

3. ప్రైవేట్ సెక్టార్ లో 2018-19 సంవత్సరానికిగానూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పశుసంవర్థక విభాగంలో 9 పాలిటెక్నిక్ కళాశాలలు, ఫిషరీస్ రంగంలో 11 పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం.

i) ప్రస్తుతం తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సీటి పరిధిలో 13 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అందులో 8 యూనివర్సిటీవి కాగా 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు.
ii) పశుసంవర్థక శాఖ రంగంలో ప్రతి సంవత్సరం 967 మంది నైపుణ్యం గల నిపుణులు అవసరం కాగా ప్రస్తుతం 500 మాత్రమే పాలిటెక్నిక్ కాలేజీల నుంచి బయటకొస్తున్నారు. ఇంకా 467 మంది కొరతను భర్తీ చేయడానికి కొత్త కళాశాలల ఏర్పాటు అవసరమని కేబినెట్ భావించింది.
iii) రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు సంబంధిత నిపుణుల కొరత ఉంది. రాష్ట్రంలో 2 లక్షల హెక్టార్ల ఆక్వా కల్చర్ సాగుకు కనీసం 4 వేల మంది నైపుణ్యం గల వ్యక్తులు అవసరమవుతారు. ఇది కాకుండా మెరైన్ వంటి రంగాల్లో మరో 2 వేల మంది అవసరం అవుతారు. ఈ కొరతను భర్తీ చేయాలన్న ధృక్పథంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

4. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు ప్రతిపాదన :

చిత్తూరు జిల్లా కుప్పంలో 850 ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు మొదట్లో ప్రతిపాదన ఉంది. అయితే రక్షణ శాఖ దీనికి NOC ఇవ్వడానికి నిరాకరించింది. అలాగే బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కు కుప్పం 150 కిలోమీటర్ల దూరంలో ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి నిరాకరించింది. అందువల్ల ప్రభుత్వమే కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు బదులు ఎయిర్ స్ట్రిప్ నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రూ. 95 కోట్ల రూపాయలతో 450 ఎకరాల్లో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఇది రాష్ట్రప్రభుత్వం ఏర్పా

టు చేసే ఎయిర్ స్ట్రిప్. దీనిలో నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్ లను ఆపరేట్ చేసే అవకాశం లేదు. ఇది కమర్షియల్ గా ఉపయోగపడనప్పటికీ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్ క్రాప్ట్స్, ఇతర చార్టెడ్ ఫ్లైట్స్ ను మాత్రమే ఆపరేట్ చేసుకోవడానికి వీలుందని ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సూచించింది.

5. అరకు ఏరియా ఆస్పత్రిలో 19 అదనపు పోస్టులు, పాడేరు ఏరియా ఆస్పత్రిలో 20 అదనపు పోస్టులు మంజూరు.దీంతో పాటు ఔట్ సోర్సింగ్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం

i) అరకు ఏరియా ఆస్పత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ (3), CSRMO(1), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7), NS Grade-2(1) , హెడ్ నర్సు (3), హెల్త్ ఇన్స్పెక్టర్ (1), ఫార్మసిస్ట్ గ్రేడ్-1(1), ఫార్మసిస్ట్ గ్రేడ్-2(2)
ii) పాడేరు ఏరియా ఆస్పత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ (4), CSRMO(1), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7), NS Grade-2(1) , హెడ్ నర్సు (3), హెల్త్ ఇన్స్పెక్టర్ (1), ఫార్మసిస్ట్ గ్రేడ్-1(1), ఫార్మసిస్ట్ గ్రేడ్-2(2)

6. అమృత్ నగరాల సర్వతోముఖాభివృద్ధికి వివిధ విభాగాల కింద 32 పోస్టులు మంజూరు

• జాయింట్ డైరెక్టర్ పోస్టులు (2)
• డిప్యూటీ డైరెక్టర్ (4)
• ఆడిట్ ఆఫీసర్(7)
• అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (19)
వీరందరిని స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్ నుండి డిప్యూటేషన్ పై నియమించాలి.

7. 25-11-1993 కన్నా ముందు నియమితులైన పుల్ టైం/ఎన్ ఎంఆర్/రోజువారీ వేతనం/ పార్ట్ టైం ఉద్యోగులకు 2015 సంవత్సరం నాటి కనీస వేతన స్కేలుకు అనుగుణంగా రెమ్యునరేషన్ కొనసాగించాలని నిర్ణయం.

i) 25-11-1993 కి ముందు నియమితులైన NMR/Daily wage/Consolidated Workers and Part Time ఉద్యోగులలలో నిబంధనల ప్రకారంగా 5 నుంచి 10 యేళ్ల సర్వీసు పూర్తి కాని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే వీరంతా కోర్టుకు వెళ్లారు. 2015 సంవత్సరం నాటి కనీస వేతన స్కేలుతో సమానమైన వేతనాన్ని ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ విస్తృతంగా చర్చించారు.

8. సీపీఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థలపై నిషేధం మరో సంవత్సరం పాటు పొడిగించాలని నిర్ణయం.

సీపీఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థలు నిషేధం మరో సంవత్సరం పాటు పొడిగించాలని నిర్ణయం. ఈ నిషేధించబడిన ఆర్గనైజేషన్ తరుచుగా చేస్తున్న ఆందోళన వలన శాంతి భద్రతలకు విఘాతం కలగడం వలన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 2005 ఆగస్ట్ 17న అప్పటి ప్రభుత్వం సీపీఐ (మావోయిస్టు), వాటి అనుబంధ సంస్థలు నిషేధాన్ని విధించారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తుంది ప్రభుత్వం. ఈ నిషేధం ఆగస్టు 16నాటికి పూర్తవుతున్న సందర్భంగా పున: సమీక్షించిన నిషేధాన్ని పొడిగించడమైంది.

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం. ఫిజియోథెరఫీ విద్యలో ప్రమాణాలు పెంపు, ప్రాక్టీస్ క్రమబద్ధీకరణ, రిజిస్టర్ నిర్వహణ వంటి అంశాలను పొందిపరిచి రూపొందించిన బిల్లుకు ఆమోదం

10. అమృత్(ఆంధ్రప్రదేశ్ వైద్య రిహాబిలిటేషన్ పర్యాటకం) పేరుతో విశాఖపట్నంలో మెడికల్ టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం

11. ఆశా వర్కర్లకు నెలకు 3,000 రూపాయల వేతనంతో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకం ఇవ్వడానికి అంగీకారం. దీనివల్ల 43,046 మంది ఆశావర్కర్లకి ప్రయోజనం.

12. ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ-2018కి సవరణలు :

x) ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ-2018కి సవరణలు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
xi) 2024 వరకు ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు/సంస్థలు జరిపే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు, లీజుకు సంబంధించి రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది.
xii) రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలను మొదట చెల్లించి తిరిగి పొందేలా వుండే విధానాన్ని సవరించి ఈ చెల్లింపులు జరుపకుండా ఈసారి మినహాయింపు ఇచ్చింది.
xiii) అలాగే ప్రభుత్వం, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు/సంస్థలు ఏర్పాటు చేసే రీచార్జింగ్, రీఫిల్లింగ్ స్టేషన్లకు విధించే స్టేట్ GSTని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది.
xiv) ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు ఎలక్ట్రిక్ వాహనాలను లీజుకు ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని విద్యుత్ శాఖకు మంత్రిమండలి సూచించింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు చెల్లించిన GSTని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పొందేందుకు వీలు కలుగుతుంది.
xv) రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వం ధ్యేయం.

13. ఏపీ టెక్స్‌ టైల్, అపరెల్, గార్మెంట్స్ పాలసీ 2018-2023 :

i) రాష్ట్ర మంత్రిమండలి ‘ఏపీ టెక్స్‌ టైల్, అపరెల్, గార్మెంట్స్ పాలసీ 2018-2023’ ఆమోదం తెలిపింది.
ii) టెక్స్‌ టైల్, అపరెల్, గార్మెంట్ యూనిట్లు నెలకొల్పేలా అనుకూల వాతావరణం కోసం ఈ పాలసీకి రూపకల్పన.