ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు త్వరలో వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. అలా వార్తలు రావడానికి కారణం ఈరోజు విశాఖపట్టణం జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రలో మాజీ డీజీపీ ఆయన్ని కలవడమే. వారి మధ్య ఏమి చర్చ జరిగిందనేది బయటకు రాకపోయినప్పటికీ ఆయన వైసేపీలో చేరేందుకే జగన్ ను కలిసి ఆయనతో చేరిక గురించి క్లారిటీ తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు జగన్ ని కలవడానికి అంతకన్నా కారణం కనపడంలేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాంబశివరావు 1987లో తన పోలీస్ సర్వీస్ ప్రారంభించారు. మొట్టమొదటగా ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత పదోన్నతులు పొందతూ డీజీపీ స్థాయికి ఎదిగారు. విభజిత ఎపీకి డీజీపీగా పని చేసిన ఆయన గత ఏడాది పదవీ విరమణ పొందారు. అయితే ఇప్పుడు ఒక కీలక అంశం చర్చలోకి వస్తోంది. అదేంటంటే ఏపీ మంత్రి దివంగత భూమా దంపతుల కుమార్తె అఖిలప్రియ పెళ్లి. అదేంటి ఈయన పార్టీలో చేరడానికి అఖిల ప్రియ పెళ్ళికి సంబంధం ఏమిటని అనుమానాలు రేకేత్తవచ్చు.
ఇక్కడ విషయమేమిటంటే ఇప్పుడు అఖిల ప్రియ పెళ్లి చేసుకునే భార్గవ్ రాం ఎవరో కాదు !, మంత్రి నారాయణ కూతురు సింధూర భర్తకు స్వయానా సోదరుడు అంతకన్నా మాజీ డీజీపీ నండూరి సాంబశివ రావుకి స్వయానా అల్లుడు. అంటే ఆయన కూతురిని భార్గవ్ రాం తొలుత వివాహం చేసుకున్నాడు. అయితే అఖిల ప్రియ పరిచయం తరువాత ఆయన తన భార్యను పట్టించుకోలేదని అందుకే విడాకుల దాకా వెళ్లిందని ఒక వర్గం చెబుతోంటే అదేమీ లేదు డీజీపీ కుమార్తెతో విభేదాలతో దూరంగా ఉన్నప్పుడే భార్గవ్-అఖిల ప్రియల మధ్య ప్రేమ చిగురించింది అని మరో వర్గం అంటోంది.
ఆ సమయంలోనే తన అల్లుడు భార్గవ్ మంత్రి అఖిల ప్రియ చాంబర్ లోనే సమయం గడుపుతున్నాడని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళారని, కానీ వారి వారి పర్సనల్ విషయాల్లో నేనెలా జోక్యం చేసుకుంటానని చంద్రబాబు ఎదురు ప్రశ్నించడంతో ఏమీ చేయలేక ఆయన మిన్నకుండిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. చంద్రబాబు వల్లే తన కూతురి జీవితం ఇలా అయిందన్న భావనలో ఉన్న ఆయన వైసీపీ అధినేతను కలిసి ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అటు వైసీపీ నుండి కానీ ఇటు సాంబశివరావు నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు. మొత్తానికి ఏది ఏమయినా ఇంకా నాలుగు రోజుల్లో వారి వివాహం ఉందనగా ఇప్పుడు డీజీపీ జగన్ ను కలవడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలే రేపుతోంది.