ప్రత్యర్థి జగన్ పై నారా వారి తనయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రియతమా ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఛలోక్తులు విసురుతూ, జగన్ ని కవ్వించే పనిని పెట్టుకున్నట్లుగా ఉంది వ్యవహారం. అంతేకాకుండా “ఒకవేళ చెత్త నటన కి, అట్టర్ ప్లాప్ డ్రామాలకి అవార్డులుంటే జగన్ క్లీన్ స్వీప్ చేస్తాడని, చెత్త నటనకు గానూ భాస్కర్ అవార్డు జగన్ కి ఇవ్వాల్సిందేనని కవ్వింపు చర్యలకు దిగాడు లోకేష్ బాబు. ఈ ట్వీట్ లో జగన్ ప్రసంగం చేస్తున్న వీడియో క్లిప్పింగులకి 108 డ్రామా, కౌ (ఆవు) డ్రామా అంటూ టైటిల్స్ కూడా ఇచ్చాడు.అసలు ఏమి జరిగిందో తెలియాలంటే, విజయనగరం జిల్లాలో జరిగిన జగన్ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, ఆ సభకు వచ్చిన, జనాల మధ్యనుండి 108 అంబులెన్సు వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో, ఇది టీడీపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు.
మరోసారి ప్రజా సంకల్ప యాత్ర అంటూ కురుపాం లో జరిగిన సభలో జగన్ ప్రసంగం చేషుతుండగా, ఒక ఆవు అక్కడున్న జనల మధ్యలోకి దూసుకువచ్చింది. ఆ సమయంలో జగన్ అక్కడున్న వారిని ఆవు కి దూరంగా జరగమని చెప్తూ, మీటింగ్ కి అంతరాయం కలిగించడానికి టీడీపీ వాళ్ళు ఇలా ఆవుల్ని కూడా తోలుతున్నారని, అసలు టీడీపీ వాళ్ళు మనుషులేనా అని మండిపడ్డారు. ఈ రెండిటిపైనే నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించి, ఆ వీడియో క్లిప్పింగులను జతచేసి, భాస్కర్ అవార్డు ని జగన్ కి ప్రధానం చేశాడు. దీనిపైనా జగన్ ఎలా స్పందిస్తాడో మరి వేచి చూడాల్సిందే.
First it was the 108 drama, followed by the Kodi Kathi drama. Now Cow Drama. If there were awards for badly-acted, flopped dramas, the Opposition Leader would have swept them all! For the time being, pls make do with “Bhaskar Award for Worst Acting.” Standing ovation to you Sir!! pic.twitter.com/XLOZMp3B2u
— Lokesh Nara (@naralokesh) November 22, 2018