సోమిరెడ్డి బూజు దులుపుతున్నారా?

somireddy fires on agricultural officers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ప్రభుత్వం అంటే నిష్క్రియాపరత్వం. ఇక అక్కడ ఉద్యోగం అంటే రాజభోగం. ఇక ఏమి జరిగినా ప్రశ్నించని అమాయక రైతులకు సంబంధించిన శాఖ అయితే మహాభాగ్యం. ఏమి హాయిలే ఇక అనుకుంటూ ఏ బాధ్యత లేకుండా నచ్చినట్టు చేయొచ్చు”… ఇలా అనుకుంటూ కాలం గడుపుతున్న వ్యవసాయ శాఖ అధికారులు కొందరికి ఊహించని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వ్యవసాయ శాఖ కి బూజులా పట్టిన కొందరు అధికారుల దుమ్ము దులుపుతున్నారు. డీటెయిల్స్ లోకి వెళితే…

ఈ ఏడాది సకాలంలో వానలు పడడంతో విత్తనాలు పంపిణీ మీద వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఏపీ సీడ్స్ వద్ద వున్న విత్తనాల్లో కొంత భాగం కాలం చెల్లిపోయినవని తేలింది. అసలు కాలం చెల్లేదాకా విత్తనాలు సరఫరా చేయకుండా ఎందుకు ఆపాల్సివచ్చిందని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదట. పైగా ప్రస్తుతం వున్న డిమాండ్ రీత్యా ఆ విత్తనాల్ని బహిరంగ మార్కెట్ లో అమ్మితే నష్టం రాబోదని ఓ అధికారి సలహా ఇవ్వడంతో మంత్రి సోమిరెడ్డి కి మండిపోయిందట. రైతులుకి విత్తనాల సరఫరా గురించి అడుగుతుంటే ఓ వ్యాపార సంస్థలా లాభనష్టాల గురించి ప్రస్తావించడంతో ఆయన సదరు అధికారుల మీద ఫైర్ అయ్యారట. ఇకపై రైతుల ప్రయోజనాలతో ముడిపడివున్న ఏ అంశం మీద అయినా బాధ్యతారాహిత్యంగా వుండే అధికారులకి చురుకుపుట్టేలా ఓ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుత నష్టానికి, రైతులకి కలుగుతున్న ఇబ్బందికి కారణమైన అధికారుల నుంచి వివరణ కోరారట. ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని ఓ ఉన్నతాధికారి పక్కకి వచ్చి ఈ మంత్రి గారు బూజు మొత్తం దులిపేట్టు వున్నాడని కామెంట్ చేయడం చూస్తుంటే వ్యవసాయ శాఖలో సోమిరెడ్డి ఏ స్థాయిలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారో అర్ధం అవుతుంది.

మరిన్నివార్తలు 

కసబ్ కేసు కంటే శిరీష కేసు గొప్పదా..?

మోడీ పేరు చెబితే ఉలిక్కిపడుతున్న చైనా