Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల టాలీవుడ్లో చిన్న సినిమాలు పెద్ద సక్సెస్‌లు అవుతున్నాయి. ‘ఫిదా’ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద టాప్ చిత్రాల్లో ఒక చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. అతి తక్కువ బడ్జెట్తె తెరకెక్కిన ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ అంటూ చెప్పుకుంటున్న సమయంలోనే ‘ఫిదా’ను తలదన్నేలా ‘అర్జున్‌రెడ్డి’ వచ్చింది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన అర్జున్‌రెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తోంది. మిలియన్ మార్క్‌ను ఓవర్సీస్లో దాటాలి అంటే పెద్ద హీరోలు సైతం చెమటోడ్చాల్సి ఉంటుంది. కాని ఈ సినిమా మాత్రం రెండు మిలియన్ డాలర్లను సునాయాసంగా రాబట్టింది.
ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ఫిదా’ సినిమా కలెక్షన్స్‌ను అర్జున్ రెడ్డి దాటేయడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ‘ఫిదా’ వద్దకు అర్జున్ రెడ్డి చేరుకోబోతుంది. మరో వారం రోజుల్లో ‘ఫిదా’ కలెక్షన్స్‌ను క్రాస్ చేయడం ఖాయం అంటున్నారు. పూర్తి ఫ్యామిలీ చిత్రం అయిన ‘ఫిదా’ను కేవలం పెద్దలకు మాత్రమే అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా దాటేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ స్థాయి విజయమో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచి పోయింది.
మరిన్ని వార్తలు: