Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అర్జున్ రెడ్డి హవా ఏ రేంజ్లో కొనసాగుతుందో మాటల్లో చెప్పలేకుండా ఉన్నాం. ఆ సినిమా వచ్చి మూడవ వారం నడుస్తున్నా కూడా ఇంకా కలెక్షన్స్ మోత మ్రోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 కోట్ల మేరకు కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ చిత్రం ఇంకా కూడా కొనసాగుతుంది. తాజాగా ‘యుద్దం శరణం’ మరియు ‘మేడ మీద అబ్బాయి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాల కలెక్షన్స్ కలిపినా కూడా అర్జున్ రెడ్డి మూడవ వారంలో దక్కించుకుంటున్న షేర్ కంటే తక్కువే ఉన్నాయి. ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తున్న అర్జున్‌రెడ్డి మరి కొన్ని రోజుల్లో 50 కోట్ల మార్క్‌ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించిన, సాధిస్తున్న ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచి పోయింది. ప్రతి రోజు ఎవరో ఒకరు స్టార్ సెలబ్రెటీ అర్జున్‌రెడ్డి గురించి మాట్లాడటం, ప్రశంసించడం చేస్తున్న నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగి పోతుంది. ఒక చిన్న హీరో సినిమా, అది కూడా ఏ సర్టిఫికెట్ సినిమా 50 కోట్లు వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మరో బాహుబలి సినిమా అంటూ ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో ఏకంగా 50 కోట్లు వసూళ్లు చేసిన అర్జున్ రెడ్డి ఈ దశాబ్దపు టాప్ 10 చిత్రాల జాబితాలో నిలవడం ఖాయం.
మరిన్ని వార్తలు: