జైట్లీ ప్రతిపాదిస్తున్న 2018-19 బడ్జెట్ లోని ముఖ్యాంశాలు…

Arun Jaitley announces 2018-19 budget details
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

* ఇంటిగ్రేటెడ్ బీఈడీనీ తీసుకుని వస్తున్నాం.
* ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డు విధానాన్ని డిజిటల్ గా మారుస్తాం.
* గిరిజన ప్రాంతాల కోసం ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు.
* విద్యాభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు.
* వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు.
* గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 14.34 లక్షల కోట్లు.
* ప్రజలందరి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ.
* ఆరోగ్య రక్షణకు జాతీయ ఆరోగ్య విధానం.
* 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల మేరకు వైద్యం ఉచితం.
* 50 కోట్ల మంది జనాభాకు ఈ పథకం ద్వారా లబ్ది.
* ప్రతి మూడు పార్లమెంటు నియోజకవర్గాలకూ ఒక వైద్య కళాశాలు, ఆసుపత్రి.
* ప్రతి ఒక్కరికీ రూ. 330 ప్రీమియంతో రూ. 5 లక్షల బీమా.
* ప్రతి పౌరునికీ సమీపంలోనే వెల్ నెస్ సెంటర్.
* వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 1,200 కోట్లు.
* 2018-19 వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు.
* నమామి గంగ ద్వారా గంగా ప్రక్షాళన.
* గంగానది ప్రక్షాళనకు 187 ప్రాజెక్టుల ద్వారా పనులు.
* ఎస్సీల సంక్షేమం కోసం రూ. 56 వేల కోట్లు.
* ఎస్టీల సంక్షేమం కోసం రూ. 39 వేల కోట్లు.
* ఎంఎస్ఎంఈలకు ఆన్ లైన్ ద్వారా రుణాల మంజూరు.
* 2018-19లో రూ. 3 వేల కోట్ల ముద్రా రుణాలు.
* ముద్రా రుణాలు పొందిన వారిలో 76 శాతం మహిళలు.
* ఫిన్ టెక్ కంపెనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు
* చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎన్పీఏలకు సంబంధించి ప్రత్యేక విధానం.
* జీవన ప్రమాణాల మెరుగుదలకు పైలట్ ప్రాజెక్టు కింద 115 జిల్లాల ఎంపిక.
* 306 కౌశల్ యోజన కేంద్రాల ఏర్పాటు.
* వస్త్ర పరిశ్రమ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు.
* చేనేత, జౌళి రంగాలకు రూ. 7,500 కోట్లు.
* మౌలిక సదుపాయాల రంగానికి రూ. 9.4 లక్షల కోట్లు.
* ఆందోళన కలిగిస్తున్న క్షయ రోగుల సంఖ్య.
* క్షయ వ్యాధిగ్రస్తుల కోసం రూ. 600 కోట్లతో పోషకాహార పథకం.
* కొత్త ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ఈపీఎఫ్ వాటా పెంపు.
* కేంద్ర ఈపీఎఫ్ వాటా 8.33 నుంచి 12 శాతానికి హెచ్చింపు.
* అన్ని రంగాల్లోని కొత్త కంపెనీలకూ మూడేళ్ల పాటు వర్తింపు.
* పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయం.
* పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి.
* గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు.
* విద్య, ఆరోగ్యం, సంక్షేమం రంగాలకు రూ. 1.38 లక్షల కోట్లు.
* చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ. 3,790 కోట్లు.
* చిన్న పరిశ్రమల మొండి బకాయిల సమస్యను పరిష్కరిస్తాం.
* టెక్స్ టైల్ రంగానికి రూ. 7,140 కోట్లు.
* రైళ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం.
* ప్రతి రైలులో సీసీటీవీలు, వైఫై సౌకర్యం ఏర్పాటు.
* ఇంటింటికీ తాగు నీటి పథకానికి రూ. 77,500 కోట్లు.
* 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి పూర్తి.
* స్మార్ట్ సిటీలకు రూ. 2.04 లక్షల కోట్లు.
* రైల్వేల మూలధన వ్యయం రూ. 1.48 లక్షల కోట్లు.
* వచ్చే రెండేళ్లలో కాపలాలేని 4,267 లెవల్ క్రాసింగ్ ల తొలగింపు.
* 600 స్టేషన్ల ఆధునికీకరణను చేపడతాం.
* 36 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్ పునరుద్దరణ.
* 18 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులు చేపట్టనున్నాం.
* అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు.
* ముంబై నగరంలో అర్బన్ రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ.
* ముంబై లోకల్ స్టేషన్ల కోసం రూ. లక్ష కోట్లు.
* 900 కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధం.
* డిజిటల్ ఇండియా కోసం రూ. 3,073 కోట్లు.
* భారత్ నెట్ కార్యక్రమం కోసం రూ. 10 వేల కోట్లు.
* బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ విధానాలు చట్ట వ్యతిరేకం.
* క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము.
* అన్ని రకాల ఆర్థిక సేవల కోసం యూనిఫైడ్ అథారిటీ ఏర్పాటు.
* గ్రామాల్లో 5 లక్షల వైఫై స్పాట్స్.
* వీటి ద్వారా 5 కోట్ల మందికి దగ్గర కానున్న వైఫై.
* ఇప్పటికే లక్ష గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం.
* దేశంలో రెండు రక్షణ రంగ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు.
* పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి.
* ప్రతి వ్యాపార సంస్థకూ ఓ ప్రత్యేక ఐడీ.
* సులభతర వాణిజ్యంలో పారదర్శకత సాధిస్తున్నాం.
* సైనిక సంపత్తి, ఆయుధాల తయారీలో స్వావలంబనకు కృషి.
* ఆయుధ తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంపు.
* రాష్ట్రపతికి నెలకు రూ. 5 లక్షల వేతనం.
* ఉప రాష్ట్రపతికి రూ. 4 లక్షలు, గవర్నర్లకు రూ. 3.5 లక్షలు.
* 2020లోగా 50 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ.
* రూ. లక్ష కోట్ల డిజిన్వెస్ట్ మెంట్ లక్ష్యాన్ని చేరుకున్నాం.
* 2018-19లో డిజిన్వెస్ట్ మెంట్ లక్ష్యం రూ. 80 వేల కోట్లు.
* గోల్డ్ మానిటైజేషన్ విధానంలో మరిన్ని మార్పులు తెస్తాం.