Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిన్న సినిమాగా వచ్చి తెలుగులో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అర్జున్ రెడ్డి ని తమిళ్, కన్నడ, హిందీలలో రీమేక్ చేయనున్నారు. తమిళ్ రీమేక్ హక్కులను ధనుష్ కు చెందిన నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. సొంత నిర్మాణంలో ధనుష్.. తమిళ అర్జున్ రెడ్డిగా నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ధనుష్ …అర్జున్ రెడ్డి గా ఆర్యను నటింపచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండలా…తమిళంలో ఆర్య అయితే… అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో బాగా నటించగలడని ధనుష్ భావిస్తున్నాడు. ఈ మేరకు ధనుష్ ఇచ్చిన ఆఫర్ కు ఆర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసి.
సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ధనుష్ భావిస్తున్నాడు.. అయితే ఆర్య ఇప్పటికే తమిళంలో ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు కోలీవుడ్ లో ఓ ఇమేజ్ ఉంది. మరి ఆ ఇమేజ్ కు భంగం కలగకుండా అర్జున్ రెడ్డిలా ఎలా నటిస్తారో చూడాలి. ఒక్క ఆర్యనే కాదు…కన్నడలో అర్జున్ రెడ్డిగా నటిస్తారని భావిస్తున్న యష్, బాలీవుడ్ లో రణ వీర్ సింగ్ కూడా అగ్రహీరోలుగా గుర్తింపు పొందారు. మరి ఈ ముగ్గురు నటులు మోడ్రన్ దేవదాస్ క్యారెక్టర్ ను ఎలా పోషిస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.