ఆ జ్యోతిష్కుడికి కాస్త సంస్కారం కావాలి.

astrology-venu-swamy-controversy-statement-on-chai-and-samantha

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మనకి స్థాయి వున్నా లేకున్నా కాస్త గొప్పోడి మీద నోరు పారేసుకుంటే గొప్పోళ్ళు అయిపోతాం అనుకుంటారు కొందరు. ఆ కోవలో మామూలు మనుషులు ఉంటే పర్లేదు. జ్యోతిష్యం ముసుగు వేసుకుని ఈ పని చేసే వాళ్ళతోనే ప్రమాదం. ఓ ఎంపీ ఇచ్చిన పాస్ తో పార్లమెంట్ ప్రాంగణంలోకి లోకి అడుగు పెట్టడంతో ఆయన గొప్పోడు అయిపోయినట్టు అనుకుంటున్నాడు వేణుస్వామి అనే జ్యోతిష్కుడు. నంద్యాల ఉప ఎన్నికలు, బిగ్ బాస్ వంటి మ్యాటర్స్ లో ఈ జోస్యుడు చెప్పింది శుద్ధ తప్పు అయిపోయింది. అయినా అయ్యగారి స్పీడ్ తగ్గలేదు. ఇంకో హాట్ టాపిక్ అందుకున్నాడు ఆయన గారు. అదే చైతు , సమంత ల పెళ్లి గురించి.

ఏ కాస్త సంస్కారం వున్నవారు అయినా కొత్తగా పెళ్లి అయిన జంట కి శుభాకాంక్షలు చెబుతారు. ఇంకా దగ్గరవాళ్ళు అయితే బహుమతులు ఇస్తారు. అసలు ఆ జంట తో సంబంధం లేనివాళ్లు కూడా కొత్త జంట హాయిగా నాలుగు కాలాల పాటు చల్లగా వుండాలని దీవిస్తారు. అయితే ఈ కాస్త సంస్కారం కూడా లేకుండా ప్రవర్తిసున్నారు వేణుస్వామి. ఆయన గారు చైతు,సమంతలు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వుంటాయని, పిల్లలు పుట్టారని ఏదేదో చెత్త వాగేశారు. వాగుడు అన్న మాట వాడకం తప్పు అనిపించినా పక్క వాళ్ళ మనోభావాల్ని జ్యోతిష్యం పేరిట గాయపరిచే ఇలాంటి వాళ్లకి బుద్ధి రావడానికి ఆ మాత్రం ఘాటు పదజాలం వాడినా తప్పు లేదనిపిస్తోంది. అప్పుడైనా సాటి వాళ్ళ మనోభావాలు ఎలా గాయపడుతున్నాయో కాస్త అయినా అర్ధం అవుతుంది.