టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా అలాగే రీతూ వర్మ, దక్ష నగర్కార్ హీరోయిన్స్ గా దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ “స్వాగ్”. మరి థియేటర్స్ వచ్చిన ఈ మూవీ డీసెంట్ పెర్ఫామర్ గా నిలిచింది.
అయితే టాలీవుడ్ అమర ప్రేమికులు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తర్వాత తీరికగా ఓటీటీలో చూసి టాలీవుడ్ ఈ మూవీ దగ్గర విఫలం అయ్యారు అని అంటారు అని అప్పుడు థియేటర్స్ లో చూసిన వారు ఠాగూర్ మూవీ లో చిరంజీవి అన్నట్టు కామెంట్స్ వచ్చాయి.
మరి ఇప్పుడు అనుకున్నదే జరిగింది.. సోషల్ మీడియాలో స్వాగ్ చూసిన ఫ్రెష్ ఆడియెన్స్ అంతా అనుకున్నట్టే స్టార్ట్ కూడా చేశారు. ఇలాంటి మూవీ కి టాలీవుడ్ లో సరైన ఆదరణ దక్కలేదు అన్నట్టుగా మొదలు పెట్టారు. అయితే దీన్ని రిలీజ్ కు ముందే శ్రీవిష్ణు చెప్పడం కూడా విశేషం.
మరి ఈ మూవీ లో శ్రీవిష్ణు నటుడుగా ఎన్నో వేరియేషన్ లు చూపించగా దర్శకుడు టెక్నికల్ గా కూడా ఎంతో బ్రిలియంట్ గా ఈ మూవీ ని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ లో మీరా జాస్మిన్ కూడా కీలక పాత్రలో నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.