Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీలో వైజాగ్ ల్యాండ్ స్కామే ఇప్పుడు హాట్ టాపిక్. మంత్రుల దగ్గర నుంచి బడాబాబుల వరకు అందరి హస్తముందని ఈ కుంభకోణంలో ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలైతే లేకలేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెగ ట్రై చేశాయి. కానీ స్వయంగా అధికార పార్టీ మంత్రే ఈ స్కామ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో.. క్రెడిట్ టీడీపీకే వెళ్లింది. మంత్రుల డిమాండ్ మేరకు చంద్రబాబు సిట్ వేయడంతో.. దర్యాప్తు చురుగ్గా సాగుతోంది.
భూమాయకు సంబంధించి మొదట్నుంచి ఆరోపణలు చేస్తున్న మంత్రి అయ్యన్న పాత్రుడు ఇప్పుడు సిట్ ముందు హాజరయ్యారు. అంతే కాదు చాలా పేజీలున్న ఓ రిపోర్ట్ సమర్పించినట్లు ఆయనే చెప్పారు. అందులో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు అయ్యన్న. దీంతో మరోసారి గంటా వర్గం చిక్కుల్ో పడ్డట్లేనని వైసీపీ చంకలు గుద్దుకుంటోంది. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయట.
ఈ వ్యవహారంలో వైసీపీ హస్తం ఉందని మొదట్నుంచీ చెబుతున్న అయ్యన్న.. ఇప్పుడు ఆ దిశగానే సాక్ష్యాలు సంపాదించారట. జగన్ రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి ఈ స్కామ్ లో ఇన్వాల్ అయ్యేరనేది టాక్. నిజంగా సిట్ కు మంత్రి సరైన ఆధారాలు సమర్పిస్తే.. అరెస్టులు కూడా జరుగుతాయని ప్రచారం నడుస్తోంది.
మరిన్ని వార్తలు