అసలేం జరిగింది అంటే.. ఆగష్టులో విజయవాడకు చెందిన 19 సంవత్సరాల యువతి వైజాగ్ లోని తన పిన్ని ఇంటికి వెళ్ళింది. నాలుగు నెలలు వారింట్లోనే ఉంది. అయితే, పిన్ని బయటకు వెళ్లిన సమయంలో యువతిపై ఆ బాబాయి మోజు పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పిన బుట్టలో వేసుకున్నాడు. అలాగే.. కోరికలు రేపిన అతను పలుమార్లు యువతిపై అత్యాచారం చేసేశాడు. అయితే ఆ విషయాన్ని ఆయువతి ఎవరితోనూ చెప్పుకోలేక లోలోన కుమిలిపోయింది. నాలుగు నెలల తర్వాత విజయవాడ వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు యువతికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ షాకింగ్ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు ఆవేదనకు లోనయ్యారు. యువతి గర్భవతి అని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. యువతిని తల్లిదండ్రులు అడగడంతో వైజాగ్ లో జరిగిన విషయం తెలిసిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.