బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటి వరకు హుందాగా నడుచుకున్న బిగ్గర్‌బాస్ బాబు గోగినేని తీరుపై ఇప్పుడు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కౌషల్ విషయంలో బాబు గోగినేని వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసంగా లేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్ అయినప్పటి నుండి కూడా కౌషల్‌తో బాబు గోగినేని ఏమాత్రం బాగున్నట్లుగా అనిపించడం లేదు. బిగ్‌బాస్ సీజన్ 2లో బాబు గోగినేని చాలా బలమైన కంటెస్టెంట్ అంటూ అంతా అనుకున్నారు. కాని గత రెండు మూడు రోజులుగా ఆయన నేను వెళ్లి పోతాను అంటూ చెప్పడం అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక నిన్నటి ఎపిసోడ్లో బాబు గోగినేని డైరెక్ట్‌గా ఈ ఇంట్లోంచి నేను వెళ్లినా వెళ్లక పోయినా కూడా మొదట కౌశల్‌ను ఆ తర్వాత గీతామాధురిని బయటకు పంపిస్తా అంటూ చెప్పడం అందరికి షాకింగ్‌గా ఉంది. గతంలో కూడా కౌశల్ ఈ ఇంట్లో ఉండేందుకు వీలు లేదని, ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో పంపిస్తాను అంటూ చెప్పాడు. తనతో పెట్టుకున్న వారు ఎలిమినేట్ అవుతారు అంటూ కౌశల్ అనడంతో బాబు గోగినేనికి నచ్చలేదట. అందుకే అప్పటి నుండి ఆయన్ను టార్గెట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక బాబు గోగినేని ఎలిమినేట్ అయిన తర్వాత కూడా కౌశల్‌ను టార్గెట్ చేసి, ఆయన్ను ఎలిమినేట్ అయ్యేలా చేస్తాను అంటూ చెప్పడంతో సోషల్ మీడియాలో సాదారణ ప్రేక్షకులు మరియు కౌశల్ ఆర్మీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.