Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘బాహుబలి’. అంతటి క్రేజ్‌ను, అంతటి సక్సెస్‌ను దక్కించుకున్న బాహుబలి సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్లు పెట్టి సెట్టింగ్‌లు వేసిన విషయం తెల్సిందే. ఆ సెట్టింగ్‌లను సినిమా పూర్తి అయిన తర్వాత కూడా అలాగే ఉంచారు. సాదారణంగా అయితే ఒక సినిమా పూర్తి అయిన వెంటనే ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్టింగ్స్‌ను తొలగించడం జరుగుతుంది. కాని మహిష్మతి రాజ్యం సెట్టింగ్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు ఫిల్మ్ సిటీ నిర్వాహకులు దాన్ని అలాగే ఉంచారు. చిత్ర యూనిట్ సభ్యులతో ఒప్పందం చేసుకుని అలాగే కంటిన్యూ చేస్తున్నారు.
ఆ సెట్టింగ్‌ను ఇతర సినిమాలకు రెంట్‌కు ఇవ్వాలని రామోజీ ఫిల్మ్ సిటీ వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆ సెట్టింగ్స్‌లో తమిళ చిత్రం ‘గులేబకావళి’ చిత్రం షూటింగ్ జరుగుతుంది. కళ్యాణ్ దర్శకత్వంలో ప్రభుదేవ హీరోగా హన్సిక హీరోయిన్గా నటిస్తున్న ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రాజరికం సీన్స్‌ను ఆ సెట్టింగ్‌లో చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రభుదేవ ఈ చిత్రంలో విభిన్నంగా కనిపించడంతో పాటు, ప్రముఖ నటి రేవతి ముఖ్య పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో గులేబకావళిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి మహిష్మతి నగరంను వెండి తెరపై ప్రేక్షకులు చూడబోతున్నారు.
మరిన్ని వార్తలు:
అవి పుకార్లే అంటున్న సంపూ