Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ మరియు బాలకృష్ణ ‘జైసింహా’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడ్డాయి. భారీ అంచనాల నడుమ తెరకెక్కి విడుదలైన అజ్ఞాతవాసి కాస్త పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు సాధించింది. కాని జైసింహా మాత్రం దారుణమైన పరాజయంను చవిచూసింది అనేది అందరికి తెల్సిన విషయమే. ముఖ్యంగా ఓవర్సీస్‌లో బాలయ్య పరువు పోయే కలెక్షన్స్ నమోదు అయ్యాయి. పర్వాలేదు అన్నట్లుగా ఫలితంను పొందిన చిత్రాలకు పబ్లిసిటీ చేయడంలో తప్పులేదు. కాని అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు సూపర్ హిట్ అంటూ ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం చాలా పెద్ద తప్పు.
జైసింహా చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి కూడా అదే తప్పును చేస్తూ ఉన్నారు. సినిమా విడుదలైన రోజే ఫలితం తేలిపోయింది. కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సక్సెస్ సక్సెస్ అంటూ పదే పదే పబ్లిసిటీ కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించారు. సినిమా సూపర్ హిట్ అని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది అంటూ ప్రకటనలు మరియు పేపర్ యాడ్స్ ఇచ్చారు. అప్పటికే బాలయ్య పరువు పోయిందని అభిమానులు నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజు ఆడటం అంటే సూపర్ హిట్ అని చెప్పుకోవాలి.
లెక్క ప్రకారం అయితే జైసింహా 50 రోజులు కాదు కదా, కనీసం 15 రోజులు కూడా ఆడలేదు. అలాటి సినిమాను విజయవంతంగా 50 రోజులు ప్రదర్శించబడినది అంటూ పబ్లిసిటీ చేసే కార్యక్రమంను నిర్మాత నెత్తిన వేసుకోవడంతో సినీ వర్గాల వారు షాక్ అవుతున్నారు. ఇలా బాలయ్య ఇమేజ్‌ను పెంచాలని నిర్మాత సి కళ్యాణ్ మరింతగా పరువు తీస్తున్నాడు అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు. సినిమా సక్సెస్ కాకున్నా ఇలా ప్రకటనలు చేయడం ఇండస్ట్రీకి ప్రమాదం అని ఆమద్య సురేష్‌బాబు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని కళ్యాణ్ మాత్రం పట్టించుకోవడం లేదు.