బాలకృష్ణుడు… తెలుగు బులెట్ రివ్యూ

Balakrishnudu Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    నారా రోహిత్, రేజీనా, రమ్య కృష్ణ , వెన్నెల  కిషోర్ 

నిర్మాతలు:  మహేంద్ర బాబు , ముసునూరు  వంశీ, శ్రీ వినోద్ నందమూరి 
దర్శకత్వం : పవన్ మల్లెల 

సినిమాటోగ్రఫీ:  విజయ్ సి. కుమార్ 
ఎడిటర్ :  కోటగిరి వెంకటేశ్వరరావు 
మ్యూజిక్ : మణిశర్మ 

ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ, హిట్టు, ఫ్లాఫ్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు తీస్తూ బిజీగా ఉంటున్నాడు నారా వారి అబ్బాయి నారా రోహిత్. ఇప్పుడు బాలకృష్ణుడు అనే మూవీ తో మనముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…

కథ

రాయలసీమ లో ఫ్యాక్ష‌నిజం ఉండటం వలన ప్రజలు నిరంతరం చంపుకుంటూ ఉంటారు. ఈ ఫ్యాక్ష‌నిజాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో క‌ర్నూలుకి చెందిన ర‌వీంద‌ర్ రెడ్డి(ఆదిత్య మీన‌న్‌), అత‌ని చెల్లెలు భానుమ‌తి(ర‌మ్య‌కృష్ణ‌) ప్రయత్నం చేస్తూ, అక్కడ ప్రజలకు మంచి పనులు చేస్తూ, వారికీ సహాయపడుతూ, ఊరిని అభివృద్ధి చేస్తుంటారు. ఇలా మంచిపనులు చేయటం వలన ప్ర‌జ‌ల్లో ర‌వీంద‌ర్‌రెడ్డికి ఆదరణ పెరుగుతుంటుంది. రవీందర్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ, ప‌ర‌ప‌తి చూసిన మరో ఫ్యాక్ష‌నిస్ట్ బ‌సిరెడ్డి(రామ‌రాజు) సీమ అభివృద్ధికి అ్డ‌డుపడాల‌నుకుంటాడు. అప్పుడు ప్రజలతో కలిసి రవీందర్ రెడ్డి , బసిరెడ్డిని అవమానపరుస్తాడు. దాంతో బసిరెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ఈ కార‌ణంగా బ‌సిరెడ్డి కొడుకు ప్ర‌తాప్ రెడ్డి(అజ‌య్‌), అత‌ని మ‌నుషులు క‌లిసి ర‌వీంద‌ర్ రెడ్డిని చంపేస్తారు. అన్న‌ను చంపిన కోపంతో భానుమ‌తి ప్ర‌తాప్ రెడ్డి మ‌నుషుల‌ను ఒక్కొక్కల్ని చంపేయిస్తుంటుంది. దాంతో భయపడిన ప్ర‌తాప్ రెడ్డి పోలీసుల‌కు లొంగిపోతాడు. జైలు నుండే ప్ర‌తాప్ రెడ్డి భానుమ‌తికి ప్రాణ‌మైన మేన‌కోడలు ఆద్య‌(రెజీనా)ను చంపడానికి ప్లాన్ వేస్తాడు. ఈ విష‌యం తెలుసుకున్న భానుమ‌తి, హైదరాబాద్‌లోని త‌న మేడ‌కోడ‌లు ఆద్యకి బాలు(నారా రోహిత్‌)ని బాడీగార్డ్‌గా నియ‌మిస్తుంది. బాలు తాను బాడీగార్డ్ అని ఆద్యకు చెప్ప‌కుండా, ఆద్య‌కి ద‌గ్గ‌రై ఆమెను కాపాడుతుంటాడు. ఇంతలోనే స‌త్ప్ర‌వ‌ర్త‌న క్రింద ప్ర‌తాప్ రెడ్డి జైలు నుండి బ‌య‌ట‌కొస్తాడు. బయటకొచ్చిన ప్రతాప్ రెడ్డి ఎలా చంపాలనుకుంటాడు.? ప్రతాప్ రెడ్డి నుంచి ఆద్యను బాలు ఎలా కాపాడుకుంటాడు? ప‌్ర‌తాప్ రెడ్డిని బాలు ఎలా ముప్ప‌తిప్ప‌లు పెడ‌తాడు? చివ‌ర‌కి ఎమైంద‌నే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

విశ్లేషణ

ప్రతి సినిమాలో బొద్దుగా కనపడే నారా రోహిత్ బాలకృష్ణుడు సినిమాలో తన లుక్ కొత్తగా కనపడాలని సిక్స్ ప్యాక్ ట్రై చేసాడు. సిక్స్ ప్యాక్ అయితే చేసాడు గాని, సిక్స్ ప్యాక్ కేవలం సాంగ్స్, కొన్ని సీన్స్ కి పరిమితం చేసాడు. ఈ సినిమా మొత్తం లావుగానే కనపడ్డాడు. ఇలా లావుగా, అప్పుడప్పుడు సన్నగా కనపడటం వలన నారా రోహిత్ ని స్క్రీన్ మీద ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేకపోయారు. ఇప్పుడున్న ప్రతి యువహీరో డాన్స్ లతో , ఫైట్ లతో వేరే హీరోలకి పోటీ ఇస్తుంటే, నారా రోహిత్ మాత్రం అటు డాన్స్ లోను ఇటు ఫైట్ లోను ప్రేక్షకుడిని మెప్పించడంలో విఫలం అయ్యాడు. ప్రీ క్లైమాక్స్ ద‌గ్గ‌ర వ‌చ్చే సాంగ్‌లో రోహిత్ కంటే రెజీనానే కెమెరాలో ఎక్కువ క‌న‌ప‌డ్డారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు నారా రోహిత్ ఎలా కనిపించాడో… ఇక ఈ సినిమా మొత్తం రేజీనా చుట్టే తిరుగుతుంది. రెజినా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో రేజీనా తన అందాల ఆరబోయటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది.

సినిమాలో భానుమ‌తిగా కీల‌క‌పాత్రలో ర‌మ్య‌కృష్ణ నటించింది. రమ్య కృష్ణ పాత్ర ముందు కాసేపు బాగానే ఉన్నా, త‌ర్వాత ఆ పాత్ర‌కు, అందులో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌కు పెద్ద స్కోప్ క‌న‌ప‌డ‌క పోవటం వలన ప్రేక్షకుడు నిరుత్సాహ పడతాడు…ఇక ఈ సినిమాలో మెయిన్ విల‌న్‌గా అజ‌య్ నటించాడు. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం అజ‌య్‌కి కొత్త‌కాదనిపించింది. ఇక ఈ సినిమాకు థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ ప్రాణం పోసాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. ఈ సినిమాలో ప్రేక్ష‌కులు థియేట‌ర్‌లో కాస్తో కూస్తో కూర్చొని ఎంజాయ్ చేస్తారంటే అది కేవ‌లం పృథ్వీ క్యారెక్ట‌ర్ వలనే‌. ఇక కమెడియన్స్ వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు, శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను తెర‌కెక్కించిన తీరు ఏమాత్రం బాలేదు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలాగానే ఈ సినిమాను కూడా పవన్ మల్లెల తెరకెక్కించాడు… మ‌ణిశ‌ర్మ తన పాట‌లతో ఆకట్టుకోలేకపోయాడు, విజ‌య్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ బానే ఉంది… నారా రోహిత్ తో డైరెక్టర్ బోరింగ్ క‌థ‌, స్క్రీన్‌ప్లేతో సాగే సినిమాను చేయాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనేది తెలియ‌డం లేదు. నారా రోహిత్ నుంచి డిఫరెంట్ మూవీ ని ఎక్స్ పెక్ట్ చేసే ప్రేక్షకుడుని ఈసారి కుడా నారా రోహిత్ నిరుత్సాహ పరిచాడు.

రేటింగ్ : 2.5/5