బాలయ్య రెండు నెలలు ఆగాల్సిందే

Balayya Is Two Months Away For His Next Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘ఎన్టీఆర్‌’కు ఎట్టకేలకు దర్శకుడు ఫిక్స్‌ అయ్యాడు. క్రిష్‌కు ‘ఎన్టీఆర్‌’ బాధ్యతలను అప్పగిస్తున్నట్లుగా ఒక వీడియోను తయారు చేసి మరీ బాలకృష్ణ విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్‌ చిత్రం కోసం బాలకృష్ణ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లాలి అంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. భారీ స్థాయిలో అంచనాల నడుమ రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ చిత్రం కంటే ముందు వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని భావించాడు. అయితే పూర్తి దృష్టి ఎన్టీఆర్‌ చిత్రంపై పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్నాడు.

‘జైసింహా’ చిత్రం విడుదలై దాదాపు అయిదు నెలలు పూర్తి కాబోతుంది. బాలయ్య కెరీర్‌లో సినిమాకు సినిమాకు ఇంత గ్యాప్‌ రావడం ఇదే ప్రథమం. బాయ్య కెమెరా ముందుకు వెళ్లాలి అంటే ఇంకా రెండు నెలలు ఆగాల్సిందే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం క్రిష్‌ బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. మణికర్ణిక విడుదలయ్యే వరకు బాలకృష్ణతో ‘ఎన్టీఆర్‌’ సినిమా మొదలు పెట్టే అవకాశం లేదు. ఈలోపు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేస్తాడు తప్ప షూటింగ్‌ను మొదలు పెట్టే ఛాన్స్‌ లేదు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని బాలయ్య ఉవ్విల్లూరుతున్నాడు. కాని క్రిష్‌ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ఎన్టీఆర్‌ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు.