Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ వస్తే కేసీఆర్ తో రాసుకుపూసుకు తిరిగే దత్తాత్రేయ.. కేంద్రాన్ని తిట్టారనే మొహమాటంతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై జీఎస్టీ 12 శాతం విధించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ బీజేపీ నేతలెవరూ ఆయన మాటలు ఖండించలేదు. దత్తన్న మాత్రం వెంటనే రియాక్టయ్యారు.
దత్తన్న స్పీడ్ రియాక్షన్ వెనుక అధిష్ఠానం క్లాస్ ఉందనే మాట వినిపిస్తోంది. బీజేపీ కంటే టీఆర్ఎస్ ఎదుగుదలే కోరుకుంటున్న దత్తన్న.. ఏ పార్టీకి చెందుతారని అమిత్ షా నిలదీయడంతో. దత్తన్న గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
ఎందుకైనా మంచిదని అందరికంటే ముందుగానే కేసీఆర్ విమర్శల్ని ఖండించేశారు. కానీ ఈ రియాక్షన్ తో కొత్త అనుమానాలు పుట్టేలా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటివ్వకూడదని ఇప్పటికే డిసైడయ్యారు బీజేపీ నేతలు. మరి దత్తన్న ప్రయత్నాలు ఫలితమిస్తాయో.. లేదో తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: