Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటుడి చిన్న చిన్న పాత్రలు చేస్తూ, నిర్మాతగా మారి స్టార్స్‌తో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా బండ్ల గణేష్ సినిమాల నిర్మాణంకు దూరంగా ఉంటున్నాడు. బండ్ల గణేష్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని ఆయనపై వస్తున్న ఆరోపణలు చెప్పకనే చెబుతున్నాయి. ఆయన వ్యాపారాలు కూడా ఆశాజనకంగా లేవు. తాజాగా మూలిగే నక్కమీద తాడిపండు అన్నట్లుగా బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు అయ్యింది. దాంతో పాటు భారీ జరిమానాను కూడా కోర్టు విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎన్టీఆర్ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు కథను వక్కంతం వంశీ అందించాడు. ఆ కథకు బండ్ల గణేష్ 25 లక్షలు ఇచ్చేందుకు కమిట్‌మెంట్ ఇచ్చాడు. అందుకోసం 25 లక్షలకు చెక్‌ను కూడా ఇవ్వడం జరిగింది. కాని ఆ చెక్ కాస్త బౌన్స్ అయ్యింది. బండ్ల గణేష్‌ను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో రచయిత వక్కంతం వంశీ నాంపల్లి కోర్టులో పిర్యాదు చేయడం జరిగింది. విచారించిన కోర్టు తాజాగా బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు 15 లక్షల జరిమానాను విధించింది. బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైు శిక్ష పడ్డా కూడా జైలుకు వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే వెంటనే బండ్ల గణేష్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. త్వరలోనే జరిమానా కట్టే అవకాశం ఉంది.