మరో కొత్త బాదుడుకి సిద్దమయిన బ్యాంకులు

Banks wants to put tax on Customers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నిన్న మొన్నటి దాకా నోట్ల రద్దుతో గగ్గోలు పెట్టిన సామాన్యుడు ఇప్పుడు బ్యాంకుల బాదుడుకు కళ్ళు తేలేసే పరిస్థితి తలెత్తింది. ఓవైపు ప్రైవేటు బ్యాంకులు ఇష్టారాజ్యంగా సర్వీస్ చార్జీలు పెంచేస్తామని ప్రకటనలు ఇస్తుంటే… ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ కూడా పెంచేసింది. అయితే ఇప్పుడు బ్యాంకులు అన్నీ కలిసి మరిన్ని ఛార్జీల మోతకు రెడీ అయ్యాయి. ఇప్పటికే లావాదేవీలపై ఆంక్షలు పెడుతూ వస్తున్న బ్యాంకులు.. వీలయినంత త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల ద్వారా చేసే లావాదేవీలు, కార్డుల ద్వారా చేసే లావాదేవీలపైనా సర్వీస్ ఛార్జి విధించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయానికి జీఎస్టీ ని కారణంగా చూపుతున్నాయి బ్యాంకులు ఇప్పటి వరకు బ్యాంకులు అందించే ఉచిత సేవలపైనా పన్ను కట్టాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ బ్యాంకులకి నోటీసులు అందించాయి.

ఈ సంవత్సరానికే కాకుండా గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని ఇన్కంటాక్స్ నుండి నుంచి నోటీసులు వచ్చాయి. ఆ ఐదేళ్ళ టాక్స్ అక్షరాల రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఇప్పటి వరకు అయితే బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఖాతాదారులకు ఉచితంగా సేవలు అందిస్తాయి. కనీస నిల్వ లేని ఖాతాదారుల సేవలపై మాత్రమె సర్వీస్ ఛార్జి బ్యాంకులు విధిస్తున్నాయి. అయితే బ్యాంకులు ఉచితంగా అందించే సేవల మీద సర్వీస్ ఛార్జీ విధిస్తున్నట్లుగా భావించి పన్ను కట్టాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ కోరింది. అయితే ఈ నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటాక్ మహీంద్రా బ్యాంకులు ఉన్నాయి.

ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా… సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ పరిగణిస్తూ నోటీసులు అందించటం కలకలం రేపుతోంది. ఈ విషయంలో బ్యాంకులు రూ.6వేల కోట్లు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఆ లోటుని భర్తీ చేయడానికి ఇక నుంచి ఇప్పటిదాకా ఉచితంగా అందిస్తున్న అన్ని లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ బ్యాంకులు వసూలు చేస్తాయి. మే నెలలో దీనికి సంబంధించి పూర్తి ఆదేశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగిది ఇప్పటిదాకా నోట్ల రద్దు తర్వాత నుండి కస్టాలు పడ్డ జనానికి మరింత దెబ్బ అనే చెప్పాలి.