Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాలలో గెలిచేది మేమే స్థాయి నుంచి గెలవడం గ్యారెంటీయే మెజార్టీ కోసమే ఆసక్తి అంటూ ప్రకటించే స్థితికి వచ్చేశాయి ప్రధాన పార్టీలు. అటు టీడీపీ, ఇటు వైసీపీ పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోపల మాత్రం ఎవరి భయాలు వారికున్నాయి. జగన్ వ్యాఖ్యలు నెగటివ్ అవుతాయేమోనని వైసీపీకి, అభివృద్ధి ఇప్పుడే మొదలుపెట్టారనే మాట వ్యతిరేకం అవుతుందని టీడీపీకి సందేహాలున్నాయి.
అందుకే ఎప్పుడూ లేనివిధంగా సీనియర్లను మోహరించి ప్రచారం చేశారు. ప్రచార పర్వం ఓ ఎత్తైతే పోలింగ్ రోజు మరో ఎత్తు. ఈరోజు పోలింగ్ సందర్భంగా తాము అనుకున్న ఓటర్లంతా బూతులకు వచ్చి ఓటేసేలా చూడటం పోలింగ్ ఏజెంట్ల పని. పోల్ మేనేజ్ మెంట్ ఎవరు బాగా చేస్తారో వారినే విజయం వరిస్తుంది. ప్రస్తుతం నంద్యాలలో టైట్ పొజిషన్ ఉంది కాబట్టి.. ఒక్క ఓటు కూడా కీలకమే.
నిన్న రాత్రి నుంచి తమ పనుల్లో బిజీ అయిపోయిన ప్రధాన పార్టీల పోలింగ్ ఏజంట్లు ఓటర్లను ఉదయం నుంచే పోలింగ్ సెంటర్లకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. మరి వీళ్లు తమ పనిలో ఎంత సక్సెస్ అయ్యారో పోలింగ్ ముగిశాకే తెలుస్తోంది. ఇప్పటికీ 1983లో జరిగిన పోలింగ్ శాతమే రికార్డుగా ఉన్న నంద్యాలలో.. ఇంత తీవ్ర పోటీలో అయినా ఓటింగ్ శాతం పెరుగుతుందో లేదోనని ఎన్నికల సంఘం కూడా ఆసక్తిగా గమనిస్తోంది.
మరిన్ని వార్తలు: