Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్క ప్రధాన పాత్రలో ‘పిల్ల జమీందార్’ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో రూపొందిన ‘భాగమతి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి సందర్బంగా వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంలో విఫలం అయ్యాయి. దాంతో ఈ చిత్రంపై యూనిట్ సభ్యులు నమ్మకం పెట్టుకుని ఉన్నారు. అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంతో పాటు ‘టచ్ చేసి చూడు’, ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇంకా ‘మనసుకు నచ్చింది’ చిత్రాలు విడుదల కాబోతున్నట్లుగా మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
ప్రస్తుతం రిపబ్లిక్ డే సందర్బంగా కేవలం ‘భాగమతి’ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరో రెండు మూడు సినిమాలు వస్తున్నా కూడా అవి సోదిలోకి కూడా వచ్చే అవకాశం లేదు. అనుష్క ‘అరుంధతి’ రేంజ్లో ‘భాగమతి’ ఉంటుందనే అభిప్రాయం ట్రైలర్ చూసిన తర్వాత వచ్చింది. దానికి తోడు ఆ చిత్రాన్ని దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లు తొగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లను బుక్ చేయడం జరిగింది. ఆ కారణంగా ఇతర పెద్ద చిత్రాలు మరియు చిన్న చిత్రాలు విడుదలకు సిద్దం కాలేదు. నిన్న మొన్నటి వరకు సై అంటే సై అన్నట్లుగా ఉన్న మంచు విష్ణు కూడా ఇప్పుడు సల్లబడ్డాడు. రిపబ్లిక్ డే స్పెషల్‌ను ఫుల్‌గా వినియోగించుకునేందుకు భాగమతికి మంచి అవకాశం దక్కింది. ఈ చిత్రం అయినా టాలీవుడ్‌కు 2018లో బోణీ కొట్టేనా అనేది చూడాలి.