భరత్‌ అనే నేను రివ్యూ… తెలుగు బులెట్

bharat ane nenu movie review
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీ నటులు : మహేష్‌బాబు, కైరా అద్వానీ, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, శరత్‌కుమార్‌, రమాప్రభ, ఆమని, సితార, పోసాని కృష్ణమురళి, రవిశంకర్‌, అజయ్‌, బ్రహ్మాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ : రవి కె.చంద్రన్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణం : డి.వి.వి సినిమాస్
నిర్మాత : డి.వి.వి.దానయ్య
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కొరటాల శివ
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను ఫీవర్ కొద్ది రోజులుగా టాలీవుడ్‌ను ఊపేస్తోంది. రాజ‌కీయాలంటేనే ఆమ‌డ దూరంలో ఉండే మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ముఖ్య‌మంత్రిగా తెర‌మీద క‌నిపిస్తుండ‌డంతో ప్రేక్ష‌కుల‌కు ఉత్కంఠ, ఆయన అభిమానులకి టెన్షన్ మామూలుగా లేదు. కొర‌టాలతో మ‌హేష్ చేసిన శ్రీమంతుడు మ‌హేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌. శ్రీమంతుడు తర్వాత మహేష్ – కొరటాల కాంబినేషన్ మరలా రానుండడంతో ఈ సినిమా మీద అనేక అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచ‌నాలు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ రోజు ఉద‌యం 5 గంట‌ల షోతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మ‌రి సీఎంగా భ‌ర‌త్ అంచ‌నాలు అందుకున్నాడా ? లేదా ? అన్న‌ది మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

స్టొరీ లైన్ :

భరత్‌రామ్‌ (మహేష్‌బాబు) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (శరత్‌ కుమార్‌)కి ఒక్కగానోక్కకొడుకు. లండన్ కేంబ్రిడ్జ్‌లో భరత్‌రామ్‌ చదువుకుంటున్న సమయంలో శరత్ కుమార్ అనూహ్యంగా హఠాన్మరణం పాలవుతారు. అయితే తండ్రి మరణంతో లండన్‌ నుంచి ఇంటికి వచ్చిన భరత్ ని తన తండ్రి పార్టీ వాళ్ళు అంతా కలిసి భరత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అయితే భరత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని బాగుచేద్దామని భావిస్తాడు. కాని బాగా నమ్మిన వాళ్ళే వెన్ను పోతూ పొడవడంతో ఆలోచనలో పడ్డ భరత్ కుళ్లుపోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఎలా మార్చాడు ? అత‌డికి ఈ క్ర‌మంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి ? న‌మ్మిన వాళ్లే అత‌డికి ఎలా వెన్నుపోటు పొడిచారు. రాజ‌కీయం, వ్వ‌వ‌స్థ మార్పు అంత సులువు కాద‌ని అర్ధం చేసుకున్న భరత్ దాని కోసం ఏం చేశాడు ? వసుమతి (కైరా అడ్వాణీ)తో ప్రేమ కథ ఎలా మొదలైంది? చివరకు భరత్‌ ఎలా జ‌నాల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాడు ? అనేదే కథ …ఇది చదవడం కంటే తెర మీద చూస్తేనే మరింత కిక్ ఇస్తుంది.

విశ్లేషణ :

నటీనటులు :

మహేష్‌ తన కెరీర్ లోనే అత్యుత్తమ నటన ఈ సినిమాలో కనబరిచాడు. ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు నటన ఈ సినిమాకే హైలెట్. అనూహ్య పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన యువకుడి పాత్రలో మహేశ్ అద్భుతంగా నటించాడు. ఇంటర్వెల్ ముందు హీరోను ఎలివేట్ చేసిన విధానం అయితే మాటల్లో చెప్పలేనిది. మహేష్ నటించిన ఉత్తమ చిత్రాల జాబితాలో ‘భరత్‌’ కచ్చితంగా ఉంటుంది. మహేష్ లుక్స్‌, బాడీ లాంగ్వేజ్ అంతా పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇంకో విషయం ఏమిటంటే అక్కడక్కడా ఆయన తండ్రి కృష్ణని గుర్తుకు తెస్తాడు మహేష్. కైరా అద్వానీకి ఇది తొలి తెలుగు చిత్రం అయినా చాలా ఈజ్ తో నటించింది. మహేష్ పక్కన ఏ హీరోయిన్ అయినా ఇట్టే సెట్ అయిపోతారు అనేదానికి మరో ఉదాహరణ. కైరా మహేష్‌ పక్కన చాలా అందంగా ఉంది. బ్రహ్మాజీ రోల్ చిన్నది అయినా ఉన్న కాసేపు నవ్వులు బాగా పండించాడు. ప్రకాష్‌రాజ్‌ మరోసారి తనకు అలవాటైన మేనరిజంతో తనకిచ్చిన పాత్రలో జీవించాడు. రావు రమేష్‌, శరత్‌కుమార్‌, రమాప్రభ, ఆమని, సితార, పోసాని కృష్ణమురళి, రవిశంకర్‌, అజయ్‌ అందరు కూడా తమ తమ పరిధి మేరకి అలరించారు.

క్రూ :

సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. ఇక సినిమాలోని మూడు యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో హింస, రక్తపాతం జోలికి వెళ్లకుండా క్లాస్‌ ప్రేక్షకులకు కూడా నచ్చేలా మాయ చేసాడు కొరటాల. రవి కె.చంద్రన్‌ కెమెరా పనితనం, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సెల్వరాజన్‌ ఆర్ట్‌ సినిమాకు మరింత రిచ్ నెస్ ని ఇచ్చాయి. నిర్మాణ విలువలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా నిర్మాతలు దర్శకుడికి సహకరించినట్టున్నారు.

ప్లస్ పాయింట్స్

మహేష్‌బాబు పాత్ర చిత్రణ, నటన
కథాంశం
ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్
సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్
యాక్షన్‌ ఎపిసోడ్స్‌
సంగీతం

మైనస్ పాయింట్స్

క్లైమాక్స్‌లో వచ్చే లేగ్

ర‌న్ టైం

తెలుగు బులెట్ పంచ్ లైన్ : భరత్ అనే నేను ప్రేక్షకులకి హామే ఇచ్చినట్టుగానే మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేశాడు.

రేటింగ్ : 4 / 5

నేటి స్వార్థ రాజకీయ నాయకులకి, టీఆర్పీ కోసం గడ్డి కరిచే మీడియా ఛానెల్స్ కి చెంప పెట్టు ‘భరత్ అనే నేను’