‘భరత్ అను నేను’ చిత్రీకరణ కాస్త ఆలస్యం అవుతున్న కారణంగా చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా వేసవి కానుకగా ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అసెంబ్లీ మరియు సచ్చివాలయంకు సంబంధించిన సెట్టింగ్స్‌ను కూడా వేయడం జరిగింది. గతంలో మహేష్‌బాబు పార్ట్‌టైం పొలిటీషియన్‌గా నటించడం మనం చూశాం. ఈ చిత్రంలో మాత్రం ఫుల్‌టైం పొలిటీషన్‌గా నటించడం మనం చూడబోతున్నాం. సినిమా ఆలస్యం కావడం ప్రేక్షకులు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా కూడా మంచి సినిమా వస్తుందనే నమ్మకంతో మాత్రం ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబుకు జోడీగా కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే. కృష్ణ గెస్ట్ రోల్లో కనిపించే అవకాశం ఉందని సమాచారం.
‘భరత్ అను నేను’ రిలీజ్ డేట్లో ట్విస్ట్
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు ఎన్నో అంచనాల నడుమ ‘స్పైడర్’ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కాని ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా ‘భరత్ అను నేను’ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు కూడా ఉన్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత కొరటాల చేస్తున్న సినిమా అవ్వడం వల్ల కూడా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాల సినిమా డేట్‌ను షూటింగ్ ప్రారంభం అయినప్పుడే అనుకుంటాడు. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేసేందుకు తన వంతు కృషి చేస్తాడు. మహేష్‌బాబుతో కొరటాల తెరకెక్కిస్తున్న ‘భరత్ అను నేను’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు. కాని మహేష్‌బాబు స్పైడర్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ డేట్లు ఇవ్వడంతో పాటు, కొన్ని కారణాల వల్ల భరత్ అను నేను చిత్రీకరణ ఆలస్యం అవుతూ వస్తుంది. దాంతో ఈ చిత్రం సంక్రాంతికి కాకుండా వేసవిలో విడుదల కాబోతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలపై నిర్మాత దానయ్య స్పందిస్తూ నిజమే అంటూ క్లారిటీ ఇచ్చాడు.