Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వ్యూహరచనలో వెనుకబడ్డ అఖిలప్రియను ప్రచారానికే పరిమితం చేసింది. మిగతా సీనియర్లంతా తెరవెనుక ఉండి కథ నడిపిస్తున్నారు. సెంటిమెంట్ కోసం అఖిలప్రియ ఫేస్ వాడుకోవాలని చంద్రబాబు సూచనల మేరకు నడుచుకుంటున్నారు.
అయితే టీడీపీ ప్రత్యర్థులు మాత్రం అఖిలప్రియ అన్యాయమైపోతోందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా చేస్తేనే నేతల మధ్య మనస్ఫర్థలు రాకుండా ఎవరి పని వారు చేస్తారని బాబు సూచించారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో కూడా కొత్త జోష్ కనిపిస్తోంది.
అటు అఖిలప్రియ కూడా హ్యాపీగానే ఉన్నారు. ప్రచారానికి తానే మెయిన్ పర్సన్ అని ఫీలైపోతున్నారు. సీనియర్లు కూడా తమ మాట ప్రకారమే వ్యూహాలు రూపొందుతున్నానయి హ్యాపీగా ఉన్నారు. దీంతో కర్రవిరక్కుండా పాము చావకుండా నంద్యాల పోరుకు తెరదించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
మరిన్ని వార్తలు:
ఆగస్టు 7న తిరుమల వెళ్లొద్దు
కెసిఆర్ డైలాగు తో గాల్లో తేలుతున్న జగన్… ఫ్లాష్ బ్యాక్ ప్లీ
అమరావతిలో ఐటీకి పునాది… డేటా హబ్ గా ఏపీ.