Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఇంత ఆధరణ ఉంది అంటే ఆ షోలో పాటించే రూల్స్ కారణం అని చెప్పుకోవచ్చు. బిగ్‌బాస్ ఇంట్లో వ్యక్తులకు కఠినంగా రూల్స్‌ను వర్తింపజేస్తారు. బిగ్‌బాస్ రూల్స్‌ను తట్టుకోలేక కొందరు అర్థాంతరంగా మద్యలోనే వెళ్లి పోవడం కూడా గమనించవచ్చు. అయితే తెలుగులో ప్రారంభం అయ్యి రెండు వారాలు పూర్తి అయ్యిందో లేదో అప్పుడే బిగ్‌బాస్ రెండు సార్లు రూల్స్‌ను బ్రేక్ చేయడం జరిగింది. మొదటిది ఇంటి సభ్యురాలిని బయటకు పంపి, మళ్లీ లోనికి జాయిన్ చేయడం. ఒక వ్యక్తి ఇంట్లోంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఉండదు. కాని ముమైత్ మాత్రం బయటకు వెళ్లి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యి మళ్లీ ఇంట్లో జాయిన్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ రెండవ సారి రూల్స్ బ్రేక్ కాబోతున్నాయి.
ఇంటి సభ్యుడికి ఎట్టి పరిస్థితుల్లో బయట ఏం జరుగుతుంది అనే విషయాలను తెలియనివ్వకూడదు. కాని ధన్‌రాజ్ విషయంలో మాత్రం ఆ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు. ధన్‌రాజ్ భార్య 8 నెలల గర్బవతి అయిన కారణంగా ఆమెకు సంబంధించిన వీడియోను ధన్‌రాజ్ కోసం ప్రసారం చేసేందుకు బిగ్‌బాస్ సిద్దం అయ్యాడు. నేడు లేదా రేపు ధన్‌రాజ్ వీడియోను చూసే అవకాశాలున్నాయి. ఆ వీడియోలో అతడి భార్య మరియు కొడుకును చూపించనున్నారు. ఇలా వరుసగా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అయితే మానవత దృక్పదంతో ఇలా చేస్తున్నాం అని షో నిర్వాహకులు చెబుతున్నారు. మరో వైపు షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా ఇలా చేస్తే పెరుగుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు.
మరిన్ని వార్తలు: