వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడి చివరికి పట్టుబట్టి సాధించారు రామ్-పూరీ జగన్నాద్ లు. సినిమాకి మిక్సడ్ రివ్యూలు వస్తున్నా కలెక్షన్లు మాత్రం రచ్చ చేస్తున్నాయి. టాక్ దేముంది చెప్పండి, సినిమా నిర్మాతలకి కలెక్షన్లు కావాలి. ఆ విధంగా పూరీ తన మాస మార్క్ ని నమ్ముకుని తీసిన సినిమా ఇప్పుడు విశ్లేషకులని సైతం కలవర పెడుతున్నాయి. ముందు నుండీ ఈ సినిమా నైజాంలో రచ్చ చేస్తుందని అందరూ భావించారు, అయితే ఒక్క నైజాం వరకే పరిమితం కాకుండా ఆంధ్రాలో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు రామ్ కెరీర్లో ఎన్నడూ చూడని వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి. అన్ని ఏరియాలు కలుపుకుని ఏకంగా 7.44 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఈ సినిమా మౌత్ టాక్ బాగా వెళ్ళడంతో చాలా ఏరియాల్లో ఎక్స్ ట్రా థియేటర్స్ యాడ్ చేశారు. అవి కూడా ఫుల్ అవుతూ మాస్ సినిమాల కోసం జనాలు ఎంతలా మొహం వాచేలా ఎదురు చూస్తున్నారో అర్ధం అయ్యేలా చేసింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. నైజాం లో మూడు కోట్ల కలెక్ట్ చేసిన ఈ సినిమా సీడెడ్ లో కోటీ ఇరవై లక్షలు కలెక్ చేసింది. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో మొత్తం రెండు కోట్ల దాకా కొల్లగొట్టింది. ఉత్తరాంధ్ర నెల్లూరుల్లో కలిపి కోటీ పదిలక్షల దాకా కలేస్క్ చేసింది. రెండో రోజు కూడా ఇస్మార్ట్ జోరు ఇలాగే సాగేలా కనిపిస్తోంది. అన్ని ఏరియాల్లో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుని రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది.