Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలిసినవాళ్ళు పెళ్ళికి పిలిస్తే సీఎం అయినా పీఎం అయినా ఆ వివాహానికి వెళ్ళడానికి టైం కుదురుతుందో లేదో చూసుకుంటారు. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం ఎవరైనా పెళ్ళికి పిలిస్తే వాళ్ళు కట్నం తీసుకుంటున్నారో లేదో చూస్తారట. ఇకపై తనని పెళ్ళికి పిలవాలి అనుకునే వాళ్ళు ముందుగా ఈ వివాహంలో కట్నకానుకలు ప్రసక్తి లేదని బహిరంగంగా ప్రకటించాలట. అలా చేస్తేనే తాను ఆ పెళ్ళికి హాజరు అవుతానని, లేదంట అసలు తనని పెళ్ళికే పిలవొద్దని నితీష్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు బీహార్ లోని సామాన్య జనంలోనూ హాట్ టాపిక్ అయ్యింది. అయినా సీఎం గారి భ్రమ గానీ ఆయన పెళ్ళికి రారని ఎవరైనా కట్నం మానేస్తారా ? అవసరం అనుకుంటే సీఎం నే పెళ్ళికి పిలవడం మానేస్తారు.
ఈ మాత్రం చిన్న విషయం నితీష్ కి మాత్రం తెలియదా ఏమిటి? తెలుసు . అయినా నితీష్ ఈ షరతు పెట్టడం వెనుక ఇంకో కారణం ఉందంటున్నారు. ఈ మధ్య కాలంలో సీఎం నితీష్ కి పెద్ద ఎత్తున పెళ్ళిపిలుపులు వస్తున్నాయట. ఒక పెళ్ళికి వెళ్లి ఇంకో పెళ్ళికి వెళ్లపోతే సమస్య .అలాగని సమయాభావం వల్ల పిలిచిన అన్ని పెళ్లిళ్లకు వెళ్లలేని పరిస్థితి. దీనికి విరుగుడుగా నితీష్ ఇలా ప్లాన్ చేసి పెళ్లిళ్ల గోల నుంచి బయటపడటమే కాకుండా సమాజానికి వరకట్నం విషయంలో తానెంత గట్టిగా వున్నాడో చెప్పినట్టు అయ్యింది. ఎంతైనా అవసరానికి అప్పట్లో మోడీని, ఈ మధ్య లాలూ ని పక్కనబెట్టి తన పదవి ఎటూ పోకుండా చూసుకున్న నితీష్ ప్లాన్స్ ఇలాగే ఉంటాయి మరి.