నితీష్ కూడా అబద్ధాలకోరేనా..?

bihar people not trusting cm nithish kumar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బీహార్ సీఎం నితీష్ కుమార్ కు జనంలో క్రెడిబులిటీ ఉంది. ఆయన పొట్టకోసినా అబద్ధం ఆడరనే బలమైన అభిప్రాయం ఉంది. అలాంటి నితీష్ కూడా ఇప్పుడు అబద్ధాలు మొదలుపెట్టారు. జేడీయూ నుంచి శరద్ యాదవ్ బయటకు వెళ్లిపోయినా కూడా తమ పార్టీ అంతా కలిసే ఉందని ఆయన నమ్మబలుకుతున్నారు.

నితీష్ లాంటి నేత ఫక్తు అవకాశవాదిగా టర్న్ కావడాన్ని సగటు బీహారీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పటికిప్పుడు ప్రజల రియాక్షన్ బయటపడకపోయినా.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నితీష్ ఓటుబ్యాంకు చీలుతుందనే అంచనాలున్నాయి. తామెంతో నమ్మకం పెట్టుకున్న నేత కూడా నిండా ముంచేశాడని జనం అనుకుంటే మాత్రం నితీష్ పనైపోయినట్లే.

కానీ ఎన్నికలనాటికి ఏదోలా జనం మెప్పు పొందడానికి నితీష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. పైగా బీజేపీతో కూడా అంతగా కలిసిపోకుండా ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని చేసినా లాలూ లాంటి దిగ్గజాన్ని రేపెలా ఎదుర్కుంటారనేదే నితీష్ బలానికి కొలబద్ద కాగలదు.

మరిన్ని వార్తలు:

ముందు నువ్వు మారు ఉప్పీ..?

జనసేనాని ఓవరాక్షన్ ఎక్కువైంది

అభివృద్ధి, సంక్షేమం రెండు చ‌క్రాలు