ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవితగాథతో సినిమా మలిచి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఫిల్మ్ మేకర్‌లు ముందుకు వస్తున్నారు. బయోపిక్‌లకు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన వస్తోంది. దాంతో చాలామంది బయోపిక్‌లు తెరపైకి తెచ్చేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అన్నగారు ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇదివరకే ‘మహానటి’ సావిత్రి బయోపిక్ విడుదలయి మంచి సక్సెస్ అయ్యింది. దాంతో వివిధ భాషల్లో బయోపిక్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జీవిత గాథతో సినిమా చేయడానికి ఇప్పటికే పలువురు ఫిల్మ్ మేకర్‌లు ప్రకటనలు చేశారు. అమ్మ జీవింతో అనేక మలుపులు ఉండడంతో చాలామంది అమ్మ బయోపిక్‌ను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
అమ్మ బయోపిక్‌లో జయలలిత పాత్రను పోషించడానికి పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికే హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి . అమ్మ బయోపిక్ అనగానే మొదటగా త్రిషను ఓ నిర్మాణ సంస్థ సంప్రదించిదట. ఆ తర్వాత మరో నిర్మాణ సంస్థ విద్యాబాలన్‌ను అడిగారట. ఇకపోతే తమిళ నాడులో అగ్ర కథానాయకగా ఇప్పటికి ఓ వెలుగు వెలుగుతున్న నయనతారను కూడా అమ్మ బయోపిక్ కోసం సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఉంగరాల జుట్టు సుందరి నిత్యా మీనన్‌ను కూడా జయలిత పాత్ర కోసం సంప్రదించారట. ప్రస్తుతం పలు అమ్మ బయోపిక్‌లలో నటించబోతున్నారంటూ త్రిష, నిత్యామీనన్, నయనతార, విద్యాబాలన్‌ల పేర్లు తమిళ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. కానీ ఇందుకు సంబంధించి ఏ ఒక్క నిర్మాణ సంప్థ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అమ్మ బయోపిక్‌ను తెరకెక్కించడానికి చాలామంది రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ నలుగురు హీరోయిన్లను సంప్రదించడం జరిగిందని కోళీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ నలుగురిలో ఎవరి ఎంపిక పట్ల అధికారిక సమాచారం లేదని తెలుస్తోంది.