కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పీడ్ చూసి 2019 ఎన్నికలు ఎలా ఎదుర్కొందామా అని ప్రధాని మోడీ ఇప్పటికే తడబడుతున్నారు. ఇంకోవైపు మిత్ర పక్షాలు దూరం అవుతున్నాయి. ఒకవేళ nda లో ఉన్నప్పటికీ మరికొన్ని పార్టీలు మోడీని ఏకిపారేస్తున్నాయి. ఈ దశలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోడీకి కొందరు బీజేపీ ఎంపీలు కూడా షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇంతకుముందే ఎన్నోసార్లు మోడీ మీద చురకలు వేసిన శత్రుఘ్న సిన్హా ఇప్పుడు మరోసారి ఎగతాళి చేశారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే మూడు ఆఫ్రికా దేశాల పర్యటనకు మోడీ వెళ్లడాన్ని శత్రుఘ్న తప్పుబట్టారు. సమావేశాలు పూర్తి అయ్యాక విదేశీ పర్యటనకు వెళ్లి ఉంటే అవకాశం ఊడిపడేది ఏమీ లేదని ఆయన అన్నారు. అంతటితో ఆగితే ఎలా ఉండేదో గానీ ఇంకా ముందుకు వెళ్లారు ఆయన. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక భూమి మీద మిగిలిన అన్ని దేశాలు తిరిగిరండి అని శత్రుఘ్న సిన్హా సెటైర్ వేశారు.