Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో ఎధురులేని విధంగా చక్రం తిప్పుతున్న కేసీఆర్ కు ఈ మధ్య కాలంలో బాగానే షాకులు తగులుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కసారిగా యాక్టివ్ కావడంతో.. గులాబీ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు బీజేపీ కేసీఆర్ ను చెడుగుడు ఆడుకుంటున్నాయి. మూసీ నదీ ప్రక్షాళనకు సంబంధించి బీజేపీ చేసిన సవాల్ తో గులాబీ బాస్ ఇరుకున పడ్డారు.
హుస్సేన్ సాగర్ శుద్ధి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి చేతులెత్తేసిన సర్కారు.. మూసీని కూడా క్లీన్ చేస్తామని ప్రకటించింది. కానీ ఆచరణలో అదేదీ అయ్యేలా లేదు. ఎందుకంటే చాలా కంపెనీల వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయి. దీని కారణంగా మూసీ పరీవాహక ప్రాంతంలో పంటలు కూడా పండక రైతులంతా భయపడుతున్నారు.
రైతులకు అభయమిచ్చిన ఆదుకోవాల్సిన సర్కారు అది వదిలేసి… కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బంగారు తెలంగాణ పేరుతో బాథల తెలంగాణ తెచ్చారని మండిపడ్డారు. ఈ విమర్శలకు కచ్చితంగా కౌంటర్ ఇవ్వలేని స్థితిలో టీఆర్ఎస్ ఉంది. మూసీ నదిలో నీళ్లు తాగితే లేనిపోని రాగాలు రావడం ఖాయం . అంటే నగరంలో పొల్యూషన్ ఉందని ఒప్పుకున్నట్లే కదా. దమ్ముంటే మూసీ నీళ్లు తాగమని కేసీఆర్ కు బీజీపే విసిరిన సవాల్ తో కలకలం రేగింది.
మరిన్ని వార్తలు:
మేనేజర్ ను దాచేసిన దిలీప్
నాయక్ ఎపిసోడ్ లో పొలిటికల్ మిక్చర్