Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ ,టీడీపీ మధ్య వైరం ఢిల్లీ నుంచి గల్లీకి కూడా చేరింది. విభజన హామీల మీద పార్లమెంట్ వేదికగా టీడీపీ పోరాటం ఉదృతం అయినప్పటి నుంచి దాన్ని కౌంటర్ చేయడానికి బీజేపీ నాయకులు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సైతం టీడీపీ అవినీతి మీద పోరాటం చేస్తాం అనే ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు కొనసాగింపు అన్నట్టు ఇంకో ఘటన బీజేపీ , టీడీపీ మధ్య వైరాన్ని ఇంకాస్త రచ్చ చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం , అందలూరులో దేశం , బీజేపీ శ్రేణుల మధ్య అనుకోని పరిణామం . బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు అక్కడ వున్న విషయం తెలుసుకున్న టీడీపీ స్థానిక నాయకులు , కార్యకర్తలు ఆయన దగ్గరకు వెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ దశలో దేశం శ్రేణుల మీద గోకరాజు రంగరాజు విసుక్కున్నారు . టీడీపీ నాయకులు కూడా అసహనానికి గురి కావడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారం సాగుతున్నప్పుడు భీమవరం టీడీపీ ఎమ్మెల్యే అంజిబాబు అక్కడే ఉన్నప్పటికీ మౌనంగా ఉండిపోయారు.