Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రమంత్రి రాందాస్ నిన్న చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనమైంది. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పై సీబీఐ మోపిన అభియోగాలు, కేసులు ఇవన్నీ కాంగ్రెస్ కావాలనే కుట్రపూరితంగా పెట్టినవంటూ కేంద్రమంత్రి కామెంట్స్ చేశారు. జగన్ నిర్దోషి అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకూ టీడీపీ ఆరోపిస్తున్నట్టు జగన్ వెనుక బీజేపీ ఉందనే వాదనకు మంత్రే స్వయంగా ఊతం ఇచ్చినట్టు అయ్యింది. ఔను వైసీపీ వెనుక మేమే ఉన్నాం. మిత్రపక్షంతో పొత్తు రద్దయ్యాక మా ఇష్టం వచ్చిన పార్టీతో ఉంటాం.. మాకు కావాల్సింది. అధికారం అంటూ ఇన్ని రోజులు నోరు విప్పలేకపోయిన కమల నాయకులు నిన్న కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల నిన్న జగన్ మావాడేనంటూ తేల్చిచెప్పినట్టయింది.
ఏపీలో బీజేపీ బలపడాలి..లేదా తమకి ఏకులా తయారయిన టీడీపీని దెబ్బతీయాలనే వ్యూహంతో బీజేపీ జగన్ ని కలుపుకోడానికి కూడా సిద్దమయ్యింది అని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో సీబీఐ జగన్‌పై 16కు పైగా ఛార్జిషీట్లు నమోదు చేసింది. 16 నెలల పాటు జైల్లోనే ఉన్న జగన్ 2014 ఎన్నికల ముందు బెయిల్‌పై బయటకు వచ్చారు. తర్వాత బీజేపీ అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన మొదటిలోనే బీజీపీకి సాగిలపడదాం అనుకున్న టీడీపీతో కలిసి ఉండటం, అయితే ఇటీవల టీడీపీతో తెగతెంపులతో పరిస్థితిని వైసీపీ అనుకూలంగా మలచుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డి రాయబారాలతో ఈడీ ఎటాచ్ చేసిన ఆస్తులు ఒక్కొక్కటీ తిరిగి జగన్ ఖాతాలోకి చేరటం మొదలైంది. అదీ కాక అమిత్‌షా జగన్ కి ఫోన్ చేసి ఏపీ బీజేపీ నుంచి ఎవరినీ, మీ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పినట్టు తెలిసింది.
అంతే కాక, వైసిపీలోకి వెళ్ళాలి అనుకున్న కన్నా లక్ష్మీ నారాయణకు కూడా అమిత్ షా ఫోన్ చేసి, వైసీపీ లోకి వెళ్ళద్దు అని, త్వరలో మీ రాష్ట్రంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయిని, చెప్పినట్టు సమాచారం… అమిత్ షా ఫోన్ చేసిన తరువాత, మనసు మార్చుకున్న కన్నా అస్వస్థత అనే వంకతో ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాందాస్ తాజా ప్రకటనతో జగన్ త్వరలో నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే.. జగన్ లక్షకోట్ల అవినీతి తప్పిదాన్ని కాంగ్రెస్ ఖాతాలోకి వేసి వైసీపీ, బీజేపీలు లాభపడాలని చూస్తున్నాయి. ఇదే జరిగితే ఇన్నాళ్ళు పాపం అమాయకుడిని ఇబ్బంది పెట్టారు అని కాంగ్రెస్ని, నీకు దీటయిన అభ్యర్ధిని దిమ్పామని చంద్రబాబుని కార్నర్ చేయాలనీ బీజేపీ చూస్తున్నట్టు అనిపిస్తోంది.