గూడెం గొడవ…టీడీపీ vs బీజేపీ…!

Bjp Vs Tdp High Tension In Tadepalligudem

ఏపీలో బీజీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరి సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బీజేపీ గొడవ రోడ్డున పడింది. ఆ జిల్లాకు చెందిన బీజేపీ నేత మాణిక్యాలరావు-టీడీపీ నేత బాపిరాజు ఒకరిపై ఒకరు సవాళ్ల విసురుకున్నారు. అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. తాజాగా తాడేపల్లిగూడెంలో అభివద్దిపై మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు చేశారు. తాను ప్రాధినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కేంద్ర నిధులతోనే అభివృద్ది చేశానని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని అనను. దీనిపై స్పందించిన బాపిరాజు తాడేపల్లిగూడెంకు ఎవరు ఎంత ఖర్చుపెట్టారో..నియోజకవర్గ అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నేత మాణిక్యాలరావుకు సవాల్ విసిరారు.

manikyala-rao

ఈ సవాల్ ను స్వీకరించిన మాణిక్యాలరావు చర్చకు సై అన్నారు. ఈ క్రమంలో బహిరంగ చర్చకు వెంకటరామన్నగూడెంకు వచ్చేందుకు ఇరు వర్గాలు సిద్ధమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది. వృద్ధిపై బహిరంగ చర్చకు వెంకటరామన్నగూడెంకు రావాలంటూ ఇరువర్గాలు సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇక్కడకు చేరుకున్న బాపిరాజును గృహ నిర్బంధం చేశారు. ముందస్తు జాగ్రత్తగా బాపిరాజుతో పాటూ మాణిక్యాలరావును హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే 144 సెక్షన్‌ను అమలు చేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం దగ్గర కూడా పోలీసుల్ని మోహరించారు. అయితే పోలీసుల్ని దాటుకొని బయటకు వచ్చేందుకు మాణిక్యాలారావు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకొని ఇంట్లో దిగ్భందించారు.

bjp and tdp alliance in suspense for 2019 elections
మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌తో కలిసి మాణిక్యాలరావును కలిసేందుకు విజయవాడ నుంచి బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కనకదుర్గమ్మ వారధి దగ్గర వారిని అడ్డుకున్నారు. దీంతో కన్నా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. రాష్టంలో ఎవరికీ రక్షణ లేకుండా పోతోందని.. తమ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తోందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా తమను అకారణంగా అడ్డుకుని అరెస్ట్ చేశారని వెల్లడించారు. ‘సేవ్ డెమోక్రసి’ పేరుతో సభలు నిర్వహించే బాబు ఏపీలో మాత్రం పోలీస్ రాజ్యం నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ బీజేపీ నేత మాణిక్యాల రావును పరామర్శించడానికి వెళుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, తనతో పాటు చాలామంది నేతలను అకారణంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

BJP MP GVL fight with tdp