బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ హిందీలో చాలా బిజీగా ఉన్నారు. ఈయన వద్ద ఇప్పటికే చాలా సినిమాలు పెండ్డింగ్‌లో ఉన్నాయి. వరుసగా హిందీ చిత్రాలు చేసుకుంటూ వస్తున్న అమితాబ్ ఈ వయస్సులు చాలా కష్టపడుతున్నారు అంటూ సినీ వర్గాల వారు అంటూ ఉన్నారు. ఈ సమయంలోనే అమితాబ్ సౌత్ చిత్రాల్లో కూడా నటిస్తూ సౌత్ సినీ అభమానులను అలరించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్న అమితాబచ్చన్, తాజాగా తమిళ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, షూటింగ్లో కూడా పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతుంది.
వానన్ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ డైరెక్టర్ సూర్య కూడా కీలక పాత్రలో కనిపించడం జరుగుతుంది. తమిళంతో పాటు హిందీలో కూడా ఈచిత్రం రూపొందుతుంది. అందుకే ఈ చిత్రంలో అమితాబ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో వానన్ మంచి పాత్రతో ఆయన్ను ఒప్పించి నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమద్య సౌత్‌లో నటించను అంటూ చెప్పిన అమితాబ్ వరుసగా సౌత్ చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. ఇదే సమయంలో బాలకృష్ణ, కృష్ణవంశీ రైతు చిత్రంకు కూడా అమితాబ్ ఓకే చెప్తే బాగుంటుందని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అప్పట్లో అమితాబ్ నో చెప్పడంతో బాలకృష్ణ ‘రైతు’ చిత్రాన్ని పక్కకు పెట్టిన విషయం తెల్సిందే.