ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ లోదారుణం చోటు చేసుకుంది. ఒకక్వారీలో జరిగిన పేలుడు దాటికి 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందిపరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పేలుడు వల్ల భారీగా ఆస్తి నష్టం కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పేలుళ్ల వల్ల మొదలయిన అగ్నికి మూడు ట్రాక్టర్ లు, ఒక లారీ దగ్దమయ్యాయి. భారీ ఎత్తున ఈపేలుడు జరగడంతో గ్రామంలోని మరో పదిళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా పేలుళ్ల ధాటికి షెడ్లు కూలిపోగా భారీ ఎత్తున వాటి కింద మనుషులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి చక్కదిద్దుతున్నారు.
ఒక పక్క మృతదేహాలు, మరోపక్క క్షతగాత్రులతో, పూర్తిగా అగ్ని జ్వాలలతో ఆ ప్రాంతం అంతా భయానకంగా ఉంది. ప్రస్తుతం అధికారులుసహాయక చర్యలు చేపట్టారు. ఈఘటన మీద ఏపీ సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికులు తక్షణమే వారిని అవసరమైతే మెరుగైన ఆసుపత్రికి తరలించి కాపాడాలని జిల్లామంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. అనుకోని ప్రమాదం వల్ల క్వారీలో బ్లాస్టింగ్ లకి ఉపయోగించే పేలుడుపదార్ధం పేలి ఈఘటనజరిగి ఉండచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మృతులంతా ఒడిశా వాసులుగానే భావిస్తున్నారు. ఒక క్వారీలో ఇంత ఎత్తున ఇలా ప్రమాదం జరగడం ఏపీ చరిత్రలో తొలి సారి అనిచెబుతున్నారు. సమయం గడిచే కొద్దీ మృతుల సంఖ్యా పెరిగే అవకాశం కనపడుతోంది.