ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో రాక్బ్యాంక్ దుర్గమాత ఆలయంలో బోనాల జాతర జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆట పాటలతో యువత హోరెత్తించారు. వేడుకను వైభవంగా నిర్వహించిన సంస్థ నిర్వాహాకులు మధు, రాజు వేముల, ప్రజీత్రెడ్డి, దీపక్ గద్దెలను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.