జగన్ కు ధన్యవాదాలు తెలిపిన నారా లోకేశ్ !

nara lokesh said thanks to jagan

టీడీపీ యువనేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ తన పాదయాత్రలో జాబు రావాలంటే బాబు పోవాలి, బాబు ఏలుబడిలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటూ పలు అబద్ధాలు చెప్పారని లోకేశ్ మండిపడ్డారు. అయితే తన పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని వైఎస్ జగన్ గారు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు అంగీకరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారి పాలనలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించారని, ఐటీ రంగంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో 175 కంపెనీల స్థాపన ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారని లోకేశ్ వివరించారు. ఇంకా ఇతర రంగాల్లో కూడా టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల వివరాలు బయటపెట్టాలని, తద్వారా మీ పత్రిక అసత్యాల సాక్షి అని అందరికీ తెలియజేయాలని జగన్ గారిని కోరుతున్నట్టు పేర్కొన్నారు.