సత్తిబాబుని జగన్ అలా అవమానించాడా…?

Botsa Satyanarayana Likely To Join Janasena Party

బొత్స సత్యనారాయణ తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా బొత్స గుర్తింపు తెచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసారు. ఇలా రాష్ట్రస్థాయి నేతగా పేరు తెచ్చుకున్న బొత్స రాష్ట్ర విభజన పుణ్యామా అంటూ నియోజకవర్గ స్థాయికి పడిపోయారు. విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందంటూ ఏపీ ప్రజలు ఆ సమయంలో కాంగ్రెస్ మీద బాగా ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మెజారిటీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు.

janasena bostha
కొందరు పూర్తిగా రాజకీయాలకే దూరమైతే కొందరు ఇతర పార్టీలలో చేరారు. వారిలో బొత్స ఒకరు. ముందుగా బొత్స టీడీపీలో చేరాలని చూసినా అటునుండి సరైన సంకేతాలు అందకపోవడంతో ప్రత్యామ్నాయమైన వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీలో కూడా బొత్స సంతృప్తిగా లేనట్టు ఆయన సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంతున్నాయి. బొత్సకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పని చేసిన అనుభవముంది. కానీ జగన్ తన సీనియారిటీకి తగిన గౌరవం ఇవ్వడంలేదని బొత్స భావిస్తున్నారట. రాష్ట్రస్థాయి నేతగా పేరుతెచ్చుకున్న తాను వైసీపీలో చేరాక జిల్లా నేత స్థాయికి దిగజారానని బొత్స ఫీల్ అవుతున్నారట.

jagan-bostha
బొత్స అలా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ తన నియోజకవర్గం వచ్చేసరికి తన పేరు చెప్పకుండా వెళ్ళిపోవడం, అంతేకాక తాను తీసుకువచ్చిన ‘కోలగట్ల వీరభద్రస్వామి’కి టిక్కెట్‌ ప్రకటించి తనకు ప్రకటించకపోవడం అవమానం అని బొత్స ఫీల్ అవుతున్నారట. అంతేకాదు తన సంగతే ఇలా ఉంటే ఇక తన కుటుంబసభ్యుల టిక్కెట్ల సంగతేంటి? వారికి టిక్కెట్లు కష్టమే? అనే ఆలోచనకు ఆయన వచ్చేసినట్టే అని చెబుతున్నారు. అసలే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. తనకి, తన కుటుంబానికి సీట్ల కేటాయింపు విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అవసరమైతే పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారట బొత్స.

jagan-ysrcp-bostha
టీడీపీలో ఇప్పుడు ఉన్న వారికే టికెట్లు అనుమానంగా ఉండడంతో జనసేనవైపు ఆయన చూస్తున్నారట. పవన్ కూడా కొత్త నాయకులనుఎతో తయారు చేయలేమని ఫిక్సయి ఇప్పటకే పాత నేతలు అందరినీ తెచ్చుకుంటున్నారు. మరి ఇక్కడ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారో లేదో వేచి చూడాల్సిందే.

rajashekarreddy