Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘సరైనోడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ మాస్ సక్సెస్‌ను దక్కించుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయిన ఆ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నాడు. ఇక బోయపాటి నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయమై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దాదాపు సంవత్సరం క్రితమే చిరంజీవితో ఒక సినిమాను చేయాలి అంటూ అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత 152వ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించే అవకాశం ఉంది.
చిరంజీవి 152వ సినిమాను పూర్తి చేసిన తర్వాత బోయపాటి శ్రీను తన తర్వాత సినిమాను బాలయ్యతో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను బాలయ్యకు బోయపాటి అందించాడు. దాంతో మరోసారి మంచి పవర్ ఫుల్ మాస్ సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయాలి అనేది బాలయ్య కోరిక. బాలయ్య తన 100వ సినిమానే బోయపాటితో చేయాలని భావించాడు. అయితే కొన్ని కారణాల వల్ల క్రిష్‌కు ఆ అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య 101వ సినిమా ‘పైసా వసూల్’ను చేస్తున్నాడు. ఆ తర్వాత తమిళ దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమా చేసి, ఆ తర్వాత బోయపాటి సినిమాలో బాలయ్య నటిస్తాడు అనే టాక్ ఉంది.
మరిన్ని వార్తలు