Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” ని రాజకీయాలకు అతీతంగా వున్నది ఉన్నట్టు తీస్తామని చెప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాస్తవానికి మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ వచ్చిన వర్మ పార్క్ హయత్ లో దిగాడు. ఆయన్ని కలవడానికి సినిమా వాళ్ళు ఎవరు వచ్చారో తెలియదు గానీ జగన్ బావ బ్రదర్ అనిల్ కొందరు వైసీపీ నేతలతో సహా అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. వర్మతో దాదాపు గంటకి పైగా బ్రదర్ అని బ్యాచ్ చర్చలు జరిపిందట. ఆ చర్చల్లో ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా సహా వివిధ అంశాలపై మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల మీద కూడా చర్చ జరిగిందట. “లక్ష్మీస్ ఎన్టీఆర్” కి సంబంధించి బ్రదర్ అనిల్ తో వర్మ మాట్లాడాక అబ్బే ఈ సినిమాకి రాజకీయాలకు సంబంధం లేదు అని చెబుతుంటే ఎవరు నమ్ముతారు ? వర్మకి ఇది ప్రత్యక్షంగా అనుభవం అయ్యింది.
బ్రదర్ అనిల్ తో భేటీలో వర్మ కి చిత్రమైన అనుభవం ఎదురు అయ్యిందట. దేశం మొత్తం మీద గొప్ప దర్శకుడిని అని చెప్పుకునే వర్మ కి ఈ భేటీలో ఊహించని షాక్ ఇచ్చారట బ్రదర్ అనిల్. ఎంతటి హీరోకి అయినా ఒప్పించినా లేకపోయినా కథ చెప్పే దమ్ము ధైర్యం వున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అలాంటి వర్మకి తన దగ్గర తమసోమాజ్యోతిర్గమయా అనే టైటిల్ తో మంచి సబ్జెక్టు రెడీ గా ఉందని బ్రదర్ అనిల్ చెప్పారట. వై. ఎస్ పాలన సహా కొన్ని అంశాలు ఇమిడిన ఆ సబ్జెక్టు సినిమాగా తీస్తే పార్టీకి బాగా ఉపయోగపడుతుందని బ్రదర్ అనిల్ అనడంతో తనని వాళ్ళు ఎలా చూస్తున్నారో వర్మకి అర్ధం అయిపోయిందట. వర్మ బయటికి ఏమి చెప్పినా బ్రదర్ అనిల్ దృష్టిలో ఆయన ఓ వైసీపీ నాయకుడు అయ్యాడేమో. మొత్తానికి వర్మ ప్రయాణం దేశమంతా గర్వంగా చెప్పుకునే దర్శకుడు నుంచి వైసీపీ నాయకుడు స్థాయికి పడిపోయిందన్నమాట.