90% అత్యాచారాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. వావి వరుస కూడా చూడకుండా, చిన్నపెద్ద లేకుండా మానభంగాలు చేస్తున్నారు. ప్రస్తుతం అతి ప్రేమ, అతి గారాబం వలన పసిపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అన్ని అందుబాటులో ఉంచుతున్నారు. అవి ఎన్ని అనర్దాలకో దారి తీస్తున్నాయి. శిక్షలు కఠినం చేస్తే రోడ్లేక్కి రాద్దాంతం చేసేది మనమే…ఏదైనా ఘటన జరిగిన వెంటనే శిక్ష వేసినా మానవహక్కుల చట్టాలు చెప్పేది మనమే. ఇప్పుడు మానవ సంబంధాలు బొత్తిగా సన్నగిల్లుతున్నాయి. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలిపై( వరసకు చెల్లెలు) లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి.
ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని బంద నగరం తింద్వారీకి చెందిన 15 సంవత్సరాల బాలిక రక్షాబంధన్ రోజున అన్న వరసయ్యే యువకుడికి రాఖీ కట్టడానికి అతని ఇంటికి వెళ్లింది. అదే అదునుగా భావించిన ఆ కీచకుడు బాలికను బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం బయటకు పొక్కడంతో బాలిక తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.