బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనతో అప్పుడే పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.సోమవారం (ఆగస్టు 21) సాయంత్రం రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ ఇద్దరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేఖా నాయక్ రేపు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆమెకు ఖానాపూర్ నుంచి టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
115 అభ్యర్థులలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఈసారి టికెట్ లేదని,జాబితాను ప్రకటించారు. వీరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రేఖానాయక్ ఒకరు. ఈ స్థానాన్ని భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్‌కు కేటాయించారు. మంత్రి కేటీఆర్‌కు రాథోడ్ నాయక్ మిత్రుడు.